టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక ఏమో ఏమో ఇది అంటున్నాడు. తనకో లవర్ కావాలని ఎదురు చూస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కబుర్లే ఇవన్నీ. రోషన్ హీరోగా ‘ఏమో ఏమో ఇది’ మూవీ తెరకెక్కుతోంది. ఇదో లవ్ స్టోరీగా బిగ్ స్క్రీన్ పైకి రాబోతుంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
ఏమో ఏమో ఇది

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి 14) ఏమో ఏమో ఇది టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రోషన్ మేక, ప్రీతి ముకుందన్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు శైలేష్ కొలను డైెరెక్టర్. హిట్ వంటి వైలెన్స్ ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను లవ్ స్టోరీగా ఏమో ఏమో ఇది మూవీని తెరకెక్కిస్తున్నాడు. అతను హింస నుంచి ప్రేమ వైపు రూట్ మార్చడం గమనార్హం. ఈ మూవీని రొమాంటిక్ కామెడీగా రెడీ చేస్తున్నాడు.
టైటిల్ గ్లింప్స్
ఏమో ఏమో ఇది టైటిల్ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది. ఈ సినిమాలో రోషన్ మేక.. అభయ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ప్రీతి ముకుందన్ ఏమో అపూర్వగా నటిస్తోంది. అమ్మతో కలిసి అభయ్ ఓ కాఫీ షాప్ కు వస్తాడు. సింగిల్ గా ఇంట్లో ఉండి నెట్ ఫ్లిక్స్ లో మలయాళం సినిమాలు చూసుకుంటున్నావని తల్లితో అభయ్ అంటాడు. మరి నువ్వు స్మార్ట్ గానే ఉన్నావు కదా ఎందుకు సింగిల్ గా ఉన్నావని తల్లి అడుగుతుంది.
అంత ఈజీ కాదు
బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో నీకు తెలుసా? ఒకరితో రిలేషన్ షిప్ లో ఉంటూనే మరొకరిని బెంచ్ మీద వెయిట్ చేయిస్తున్నారని బెంచింగ్ గురించి తల్లికి చెప్తాడు అభయ్. ఇంకా ఘోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్, పాకెటింగ్, కషనింగ్, రెడ్ ఫ్లాగ్, షెల్పింగ్.. ఇలా ఇప్పుడు రిలేషన్ షిప్ ట్రెండ్స్ గురించి తల్లికి ఆవేశంగా చెప్తాడు.
{{/usCountry}}బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో నీకు తెలుసా? ఒకరితో రిలేషన్ షిప్ లో ఉంటూనే మరొకరిని బెంచ్ మీద వెయిట్ చేయిస్తున్నారని బెంచింగ్ గురించి తల్లికి చెప్తాడు అభయ్. ఇంకా ఘోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్, పాకెటింగ్, కషనింగ్, రెడ్ ఫ్లాగ్, షెల్పింగ్.. ఇలా ఇప్పుడు రిలేషన్ షిప్ ట్రెండ్స్ గురించి తల్లికి ఆవేశంగా చెప్తాడు.
{{/usCountry}}ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? పెళ్లయిన వారానికే మొగుళ్లను హనీమూన్ కు తీసుకెళ్లి వేసేస్తున్నారంటా. బ్లూ డ్రమ్ములు, ప్రెషర్ కుక్కర్లు చూస్తే అబ్బాయిలకు దడ పుట్టిస్తుందని తల్లికి అభయ్ వివరిస్తాడు.
రిలీజ్ ఎప్పుడంటే?
నాకు కూడా ఓ మంచి లవ్ స్టోరీ రాసే ఉంటాడు లే అని అభయ్ చెప్పగానే హీరోయిన్ అపూర్వ ను ఇంట్రడ్యూస్ చేశారు. చివర్లో హీరోయిన్ ను చూసి అభయ్ ఇంప్రెస్ అవుతాడు. ఈ ఏమో ఏమో ఇది సినిమాను 2026 దసరాకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దీనికి హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ ఫ్రెష్ ఫీల్ ఇస్తోంది.