ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది! సుమంత్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వైరల్
హీరో సుమంత్ జోరు పెంచాడు. ఓటీటీలో వచ్చిన అనగనగాతో సక్సెస్ బాట పట్టిన సుమంత్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇవాళ సుమంత్ బర్త్ డే సందర్భంగా మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
సీనియర్ హీరో సుమంత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇవాళ (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుమంత్ కొత్త సినిమా పేరు ‘న్యూటన్స్ థర్డ్ లా’. టేబుల్ వెనక ఛైర్లో కూర్చున్న సుమంత్ సీరియస్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్.

సుమంత్ కొత్త సినిమా
న్యూటన్స్ థర్డ్ లా సినిమాతో సుమంత్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. రాజేష్ కర్ణ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ న్యూటన్స్ థర్డ్ లా మూవీలో సుమంత్ తో పాటు శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాధ్ వర్మ, నేహా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈటీవీ విన్ నిర్మిస్తోంది.
ఫస్ట్ లుక్
న్యూటన్స్ థర్డ్ లా మూవీ నుంచి సుమంత్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ ఆఫీస్ లో టేబుల్ వెనకాల కర్చీలో కూర్చున్నాడు సుమంత్. కళ్లకు అద్దాలతో సీరియస్ గా చూస్తున్నాడు. ఈ పోస్టర్ ను ఈటీవీ విన్ సోమవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రి యాక్షన్ ఈ రోజు సాయత్రం 4.05 గంటలకు అని ఆ పోస్టర్ లో పేర్కొంది.
‘‘ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. ఇది చాలా బలంగా తాకబోతుంది. న్యూటన్స్ థర్డ్ లా థ్రిల్ రైడ్ కు రెడీ అవండి. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ప్రి యాక్షన్’’ అని ఈటీవీ విన్ క్యాప్షన్ పోస్టు చేసింది.
రిలీజ్ డేట్
సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న న్యూటన్స్ థర్డ్ లా సినిమా రిలీజ్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ మే 15, 2026న రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ‘ప్రతి సమాధానాన్ని ప్రశ్నించాల్సిందే’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతోంది.
సుమంత్ సినిమాలు
సుమంత్ 1975 ఫిబ్రవరి 9న జన్మించాడు. 1999లో వచ్చిన ప్రేమ కథ సినిమాతో అతను డెబ్యూ చేశాడు. ఆ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మా, స్నేహమంటే ఇదేరా, సత్యం, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సుబ్రహ్మణ్యపురం, సీతారామం తదితర సినిమాల్లో నటించాడు.
అనగనగాతో
సుమంత్ కెరీర్ కు మళ్లీ జోష్ ఇచ్చిన మూవీ అనగనగా. ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాతో సుమంత్ మరోసారి తెలుగు ఆడియన్స్ కు చేరువయ్యాడు. వ్యాస్ సార్ గా ఈ మూవీలో సుమంత్ నటనతో కట్టిపడేశాడు. ఈ మూవీ కూడా ఓటీటీలో గతేడాది మే 15న రిలీజ్ అయింది. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఏమో 2026 మే 15న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


