...
...
Next Story

OTT Telugu: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌.. స్కూల్‌లో పాప‌ను రేప్‌

OTT Telugu: వరలక్ష్మి శరత్ కుమార్ విభిన్నమైన క్యారెక్టర్లతో నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన మూవీ ఎస్.సరస్వతి. వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది.

Published on: Apr 3, 2026, 13:46:53 IST
Advertisement

తెలుగు సినిమా ఒకటి సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఎస్.సరస్వతి’. ఈ సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండానే సడెన్ గా శుక్రవారం (ఏప్రిల్ 3) డిజిటల్ డెబ్యూ చేసింది.

ఎస్.సరస్వతి ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ (x)

సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడామె మెగా ఫోన్ పట్టింది. ఫస్ట్ టైమ్ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె డైరెక్ట్ చేసిన ‘ఎస్.సరస్వతి’ సినిమా ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైలెంట్ గా వచ్చేసింది.

టైటిల్ తో కాంట్రవర్సీ

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన ఎస్.సరస్వతి మూవీ టైటిల్ పై వివాదం రేగింది. ఫస్ట్ ఈ సినిమాకు సరస్వతి అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత అభ్యంతరాలు రావడంతో ఎస్.సరస్వతిగా మార్చారు. ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది.

కథను అత్యాచారం

సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా, వరలక్ష్మికి మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘ఇది తన కథ కాదు అని, కథను అత్యాచారం చేశారని’ సాయి మాధవ్ సంచలన పోస్టు పెట్టాడు. ‘అత్యాచారం అని ఎలా అంటారు. కథను మారుస్తున్నట్లు చెప్పాలనుకున్నా. కానీ ఆయన దొరకలేదు’ అని వరలక్ష్మి స్ట్రాంగ్ గా రియాక్టయింది.

థియేటర్ రెస్పాన్స్

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురైన ఎస్.సరస్వతిని స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్తుంది. సాయంత్రం పాపను తిరిగి తీసుకెళ్దామని వస్తే అసలు సరస్వతి అనే పేరుతో పాపనే లేదని స్కూల్ వాళ్లు చెప్తారు.

ఆ తర్వాత తన పాపను స్కూల్ లోనే ముగ్గురు రేప్ చేసి చంపేశారని లక్ష్మి పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇస్తుంది. శవాన్ని పాతిపెట్టారని ఓ ప్లేస్ చూపిస్తుంది. కానీ అక్కడ ఏం ఉండదు. లాయర్ రామానుజం (ప్రకాష్ రాజ్) సాయంతో లక్ష్మి కోర్టును ఆశ్రయిస్తుంది. కానీ ఆధారాలు లేవని కోర్టు కేసును కొట్టివేస్తుంది.

కట్ చేస్తే ఓ జడ్జీని, ఐఏఎస్ ఆఫీసర్ ను, పోలీస్ ను లక్ష్మి మర్డర్ చేస్తుంది. వీళ్లు తన కూతురిని చంపారని చెప్తుంది. అసలు ఇంతకు లక్ష్మికి కూతురు ఉందా? ఆమె గతం ఏంటీ? అన్నది ఎస్.సరస్వతి మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe