Saif Ali Khan Home Intruder Case Nurse: ముంబైలోని విలాసవంతమైన బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివాసంలోకి చొరబడి దాడి చేసిన ఉదంతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ ముంబై న్యాయస్థానంలో వేగవంతమైంది.
సైఫ్ చిన్న కుమారుడు

దాడికి పాల్పడిన నిందితుడిని బాధితురాలు, సైఫ్ చిన్న కుమారుడు జేహ్ సంరక్షకురాలైన 59 ఏళ్ల నర్స్ (ఆయా) కోర్టులో స్పష్టంగా గుర్తుపట్టింది. గత ఐదేళ్లుగా సైఫ్ కుటుంబం వద్ద పనిచేస్తున్న సదరు నర్సే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు కావడం గమనార్హం. న్యాయమూర్తి సమక్షంలో ఆ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనను ఆమె వివరించింది.
అర్ధరాత్రి 2 గంటల భయానక దృశ్యం
ఆ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూమ్ లైట్ వెలుగుతుండటంతో కరీనా కపూర్ ఏమోనని భావించినట్లు ఆయా తెలిపింది. అయితే కొద్దిసేపటికే ఒక అపరిచిత వ్యక్తి చిన్నారి జేహ్ బెడ్ వైపు అడుగులు వేయడం ఆమె గమనించింది. ప్రమాదాన్ని గ్రహించి చిన్నారిని ఎత్తుకునేందుకు పరుగెత్తగా.. ఆ వ్యక్తి హ్యాక్సా బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు.
"కోటి రూపాయలు ఇవ్వు" అని నిందితుడు అరుస్తు బెదిరించాడని సదరు నర్స్ కోర్టులో వెల్లడించింది. ఆ అలజడికి జేహ్ సంరక్షణ బాధ్యతలు చూసే మరొక ఆయా కూడా లేచి కేకలు వేసింది. ఆ శబ్దాలు విన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వెంటనే గదిలోకి వచ్చారు.
గాయపడినా ఎదురొడ్డిన సైఫ్
ముందుకొచ్చిన నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై కూడా బ్లేడ్‌తో దొంగ దాడికి తెగబడ్డాడు. ఇంటి సిబ్బందిపై కూడా నిందితుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. సైఫ్ ధైర్యంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే.. మిగతా సిబ్బంది పిల్లలను పక్క గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నారు.
"నేను చనిపోతాననే అనుకున్నా": సైఫ్ భావోద్వేగం
{{/usCountry}}ముందుకొచ్చిన నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై కూడా బ్లేడ్‌తో దొంగ దాడికి తెగబడ్డాడు. ఇంటి సిబ్బందిపై కూడా నిందితుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. సైఫ్ ధైర్యంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే.. మిగతా సిబ్బంది పిల్లలను పక్క గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నారు.
"నేను చనిపోతాననే అనుకున్నా": సైఫ్ భావోద్వేగం
{{/usCountry}}ఈ లోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన సైఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఉదంతంపై సైఫ్ అలీ ఖాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. "తెల్లటి కుర్తా పైజామా మొత్తం రక్తంతో తడిసిపోయింది. నేలపై పడిపోయిన ఆ క్షణంలో నేను చనిపోతాననే అనుకున్నా" అని సైఫ్ పేర్కొన్నారు.
ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో తన పెద్ద కుమారుడు తైమూర్ దగ్గరకు వచ్చి.. "నాన్నా.. నువ్వు చనిపోతావా?" అని అడిగిన ప్రశ్న తన మనసును కలిచివేసిందని గుర్తుచేసుకున్నారు. సమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలే ఇలాంటి నేరాలకు కారణమవుతున్నాయని, నిందితుడిని క్షమించాలనిపించినా తనను చంపాలని చూడటాన్ని మాత్రం ఒప్పుకోలేకపోయానని దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.
రెండుసార్లు నేరం అంగీకరించినా విచారణ కొనసాగింపు
ఘటన జరిగిన మూడు రోజులకే ముంబై పోలీసులు 31 ఏళ్ల నిందితుడు మహమ్మద్ షరీఫుల్‌ను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించేందుకు రెండుసార్లు కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. చట్టప్రకారమే పూర్తి స్థాయి విచారణ జరిపి శిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఇచ్చిన సాక్ష్యంతో నిందితుడికి శిక్ష ఖాయమని తెలుస్తోంది.