...
...
Next Story

Saiyami Kher: అది తీసేసి ప్లాస్టిక్ బొమ్మల మారమన్నారు.. సాయి ధరమ్ తేజ్ రేయ్ హీరోయిన్ సయామీ ఖేర్ కామెంట్స్

Saiyami Kher About Appearance And Curly Hair: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నిర్దిష్టమైన రూపం, డ్రెస్సింగ్ ఉండాలంటూ వచ్చిన ఒత్తిళ్లపై సాయి ధరమ్ తేజ్ నటించిన రేయ్ సినిమా హీరోయిన్ సయామీ ఖేర్ స్పందించారు. తనను ప్లాస్టిక్ బొమ్మలా మారమని సూచించారని, కానీ, దానికి తాను ఇష్టపడలేదని చెప్పారు.

Published on: Aug 17, 2026, 14:48:59 IST
Advertisement

Saiyami Kher About Appearance And Curly Hair: చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలంటే కొన్ని విషయాలకు లోబడి నడుచుకోవాలనే ఒత్తిళ్లు ఉండటం కొత్తేమీ కాదు. గ్లామర్, శారీరక రూపురేఖలు, వేసుకునే బట్టల విషయంలో హీరోయిన్లపై తరచూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాలను, పరిశ్రమలోని విచిత్రమైన సలహాలను ప్రముఖ నటి సయామీ ఖేర్ తాజాగా పంచుకున్నారు.

ఉంగరాల జుట్టు తీసేయ్..

అది తీసేసి ప్లాస్టిక్ బొమ్మల మారమన్నారు.. సాయి ధరమ్ తేజ్ రేయ్ హీరోయిన్ సయామీ ఖేర్ కామెంట్స్
అది తీసేసి ప్లాస్టిక్ బొమ్మల మారమన్నారు.. సాయి ధరమ్ తేజ్ రేయ్ హీరోయిన్ సయామీ ఖేర్ కామెంట్స్

తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన పరిస్థితులపై సయామీ ఖేర్ మాట్లాడుతూ, అనేక మంది మేనేజర్లు తనకు చిత్ర విచిత్రమైన ఉచిత సలహాలు ఇచ్చారని తెలిపారు. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎలా ఉండాలో అలాగే కనిపించాలని, వేషధారణ సైతం అదే విధంగా మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. చివరికి తన సహజమైన ఉంగరాల జుట్టును (Curly Hair) కూడా మార్చుకోవాలని సూచించారని సయామీ వెల్లడించారు.

ప్లాస్టిక్ బార్బీ బొమ్మలా ఉండు!

"చాలామంది మిమ్మల్ని ఒక మూస పద్ధతిలోకి నెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ, మీలోని ప్రత్యేకతే మిమ్మల్ని పదిమందిలో వేరుగా నిలబెడుతుంది. ఇతరుల మాటలు విని ఉంటే నేను పరిశ్రమలో తయారయ్యే ఒక ప్లాస్టిక్ 'బార్బీ బొమ్మ'లా మారిపోయేదాన్ని. అలా మారడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు" అని సయామీ ఖేర్ అన్నారు.

నా వ్యక్తిత్వం వేరు

"నన్ను పెంచిన పద్ధతి, నా వ్యక్తిత్వం వేరు. క్రీడలు, రాజకీయం వంటి విషయాలపై నాకు నచ్చినట్లు మాట్లాడేదాన్ని. నన్ను నేనుగా ఉంచుకోవడమే నా బలం" అని సయామీ ఖేర్ పేర్కొన్నారు. ఇండస్ట్రీ చెప్పిన నిబంధనలకు తలొగ్గకపోవడం వల్ల తన కెరీర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని సయామీ నిరూపించారు.

బాక్సాఫీస్ ఫలితాలకంటే కంటెంట్‌కే ప్రాధాన్యం

ఆ తర్వాత సాంప్రదాయ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకున్నారు సయామీ. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'చోక్డ్', అలాగే 'మౌళి', ఓటీటీ సిరీస్ 'స్పెషల్ ఓపీఎస్', 'బ్రీత్: ఇన్‌టు ది షాడోస్', '8 ఎ.ఎమ్. మెట్రో' వంటి ప్రాజెక్టులతో నటిగా తన ముద్ర వేశారు.

మహిళా క్రికెటర్‌గా

ముఖ్యంగా 2023లో వచ్చిన 'ఘూమర్' సినిమాలో వైకల్యాన్ని జయించిన మహిళా క్రికెటర్‌గా సయామీ ఖేర్ చూపించిన అభినయానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సయామీ ఖేర్ నటించిన తాజా చిత్రం 'పల్ భర్ కే లియే' ఇటీవల మెల్‌బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.

వరుస ఆఫర్లతో బిజీగా నటి

ఇందులో ఆమె ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ పాత్రలో అలరించారు. దీనితో పాటు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న 'హైవాన్' చిత్రంలోనూ సయామీ ఖేర్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe