...
...
Next Story

Sai Dharam Tej Wife: వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కు కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!

Sai Dharam Tej Wife: సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయిని నవంబర్ 5న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్, ఆమె చదువు, ఫ్యామిలీ, ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలు చూద్దాం.

Published on: Nov 8, 2026, 13:34:34 IST
Advertisement

Sai Dharam Tej Wife: మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో కిరణ్మయితో సాయి తేజ్ నిశ్చితార్థం అత్యంత ఘనంగా, కన్నుల పండువగా జరిగింది.

మెగా ఫ్యామిలీ

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కు కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే! (x/IamSaiDharamTej)
వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కు కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే! (x/IamSaiDharamTej)

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ వేడుకలో సందడి చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం సోషల్ మీడియాలో కాబోయే దంపతులకు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు.

కిరణ్మయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి ఎవరు అని తెలుసుకునేందుకు జనాలు గూగుల్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కిరణ్మయి ఎవరో కాదు, ఆమె సాయి తేజ్ కు చిన్ననాటి స్నేహితురాలు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి, చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు వెళ్ళింది.

తండ్రి బిజినెస్ మ్యాన్

కిరణ్మయి కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆమెది గొప్ప వ్యాపార కుటుంబం. కిరణ్మయి తండ్రి దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అంతేకాకుండా ఆయన టాలీవుడ్ లో పలు సినిమాలకు ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆమె వందల కోట్లకు వారసురాలని సమాచారం.

కిరణ్మయి ఏం చేస్తారంటే?

కిరణ్మయి ఆస్తుల వివరాలపై అధికారికంగా ఎక్కడా కచ్చితమైన సంఖ్య లేకపోయినప్పటికీ.. ఆమెది అత్యంత సంపన్న కుటుంబం. కిరణ్మయి తండ్రికి దేశవ్యాప్తంగా ఉన్న భారీ వ్యాపార సామ్రాజ్యం, దానికి తోడు సినీ ఫైనాన్స్ నేపథ్యం దృష్ట్యా, వీరి కుటుంబానికి వందల కోట్లలోనే ఆస్తులు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పెళ్లి ఎప్పుడంటే?

సాయి దుర్గా తేజ్, కిరణ్మయిల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్ లో అత్యంత అంగరంగ వైభవంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కెరీర్ పరంగా కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'సంబరాల ఏటిగట్టు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks