Sai Pallavi: సాయి పల్లవి.. పెద్దగా అందం లేకపోయినా, గొంతు బాగా లేకపోయినా, ఈకాలం హీరోయిన్లలా స్కిన్ షో చేయకపోయినా సౌత్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె జగపతి బాబు పాపులర్ షో జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 తొలి ఎపిసోడ్ కు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. అయితే ఇందులో రణ్బీర్ కపూర్ ఆమెకు పంపిన స్పెషల్ సందేశం వైరల్ అవుతోంది.
ప్రేమమ్ తర్వాత అలా..

జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్మురా రెండో సీజన్ కు వచ్చిన సాయి పల్లవి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. ప్రేమమ్ మూవీ తర్వాత ఫేస్ బుక్ డీపీల్లో తన ఫొటో పెట్టుకోవడం చూసి షాకయ్యానని ఆమె చెప్పింది. ఇక అప్పట్లో తన ముఖం కూడా అంత బాగా లేదని, చాలా మొటిమలు ఉండేవని వెల్లడించింది. తన గొంతు కూడా మగాళ్ల గొంతులాగా ఉండేదని, రూమ్ సర్వీస్ కు కాల్ చేస్తే చెప్పండి సర్ అనే వాళ్లను ఆమె నవ్వుతూ చెప్పగా.. సో క్యూట్ అని జగపతి బాబు అన్నారు.
ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలిచాను
ఇక నీ కెరీర్లో జయమ్ము నిశ్చయమ్మురా అనే మూమెంట్ ఏదైనా ఉందా అని జగపతి బాబు అడిగారు. దీనికి సాయి పల్లవి స్పందిస్తూ.. ఏ సెట్ లో ఓడిపోయానే అదే సెట్ లో ప్రభుదేవా సర్ నాకు కొరియోగ్రఫీ చేశారు.. రౌడీ బేబీ సాంగ్ కోసం అని చెప్పింది. పూర్తి అంకిత భావంతో కష్టపడితే ఫలితం ఎప్పటికైనా వస్తుంది అని ఆమె చెప్పగానే అందుకనే నీకు ఇప్పుడు సీత పాత్ర వచ్చిందని జగపతి బాబు అన్నారు. ఆ వెంటనే రామాయణ మూవీ రాముడు రణ్బీర్ కపూర్ ఓ స్పెషల్ సందేశాన్ని ఆమె కోసం పంపించారు.
నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో రణ్బీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
సాయి పల్లవి అంకితభావమే ఆమెను సీతను చేసింది
{{/usCountry}}నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో రణ్బీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
సాయి పల్లవి అంకితభావమే ఆమెను సీతను చేసింది
{{/usCountry}}ఈ వీడియోలో మాట్లాడిన రణ్బీర్ కపూర్.. సాయి పల్లవి నైతిక విలువలు, నటనపై ఆమె చూపించే అంకితభావం చూసి తాను ఎంతగానో ఇంప్రెస్ అయ్యానని చెప్పారు. తెరపై సీతాదేవి పాత్రకు ప్రాణం పోయడానికి సాయి పల్లవి కంటే సరైన నటి మరొకరు ఉండరని, ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని ఆయన ప్రశంసించారు.
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో రానుంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇక జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు (Zee Telugu) ఛానెల్లో కూడా ఇది టెలికాస్ట్ కానుంది. మైథలాజికల్ మూవీస్ లవర్స్కు రామాయణం అప్డేట్స్ ఒకవైపు కిక్ ఇస్తుంటే, ఓటీటీ ఆడియన్స్కు ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పవచ్చు.