...
...
Next Story

Sai Pallavi: కల్కి 2 సెట్స్ లో సాయి పల్లవి.. ముహూర్తం ఫిక్స్.. పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్!

Sai Pallavi: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సీక్వెల్ ‘కల్కి 2’ నుంచి ఓ మేజర్ అప్డేడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకునే సాయి పల్లవి ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయేందుకు రెడీ అయ్యారని టాక్. అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు.

Published on: Oct 12, 2026, 05:52:33 IST
Advertisement

Sai Pallavi: రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2' (Kalki 2) కు సంబంధించి సినీ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోనె స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కల్కి 2 సెట్స్‌లోకి సాయి పల్లవి?

కల్కి 2 సెట్స్ లో సాయి పల్లవి.. ముహూర్తం ఫిక్స్.. పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్!
కల్కి 2 సెట్స్ లో సాయి పల్లవి.. ముహూర్తం ఫిక్స్.. పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్!

'కల్కి 2898 AD' సాధించిన రూ.1200+ కోట్ల గ్లోబల్ విజయం తర్వాత, దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ 'కల్కి 2' పనులను వేగవంతం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు సాయి పల్లవి భాగం కాబోతోందనే వార్త ఫ్యాన్స్‌లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతోంది.

అప్పటి నుంచే

తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే కల్కి 2 కొత్త షెడ్యూల్‌లో సాయి పల్లవి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలు, కాల్ షీట్ల సమస్యల వల్ల దీపికా పదుకోనె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఆ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ ఎంపిక చేసినట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అయితే, నిర్మాతలు వైజయంతీ మూవీస్ ఈ విషయంపై ఇంకా అధికారిక ముద్ర వేయాల్సి ఉంది.

'సుమతి' పాత్రలో

మొదటి భాగం 'కల్కి 2898 AD'లో సుమతి (SUM-80) గా దీపికా పదుకోనె కీలక పాత్ర పోషించింది. కల్కి అవతారానికి జన్మనిచ్చే తల్లిగా ఆమె పాత్ర చుట్టూనే సినిమా అంతా నడుస్తుంది. ఇప్పుడు ఆ పాత్రను సాయి పల్లవితో రీప్లేస్ చేస్తున్నారా? లేదా సీక్వెల్‌లో కల్కి రక్షణ కోసం వచ్చే మరొక పవర్‌ఫుల్ మైథలాజికల్ క్యారెక్టర్‌గా సాయి పల్లవి కనిపిస్తుందా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నాగచైతన్య సరసన 'తండేల్' (Thandel) తో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ పాన్-ఇండియా బిగ్ ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana) లో సీతాదేవిగా ఆమె నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'మహానటి' లో సావిత్రి పాత్రను ఆవిష్కరించిన నాగ్ అశ్విన్.. సాయి పల్లవికి ఉన్న నేచురల్ యాక్టింగ్ ఎబిలిటీని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రతిష్టాత్మక సైన్స్-ఫై ఎపిక్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ ప్లాన్

'రామాయణ' సినిమాతో సాయి పల్లవి హిందీ బెల్ట్‌లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ దీపికా స్థానంలో సౌత్ అండ్ నార్త్ రెండింటిలోనూ పాజిటివ్ ఇమేజ్ ఉన్న సాయి పల్లవి రావడం వల్ల కల్కి 2 సినిమా నాన్-థియేట్రికల్ అండ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం లేదు.

నాగ్ అశ్విన్ సినిమాల్లో మహిళా పాత్రలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 'మహానటి'లో కీర్తి సురేష్‌ను, 'కల్కి'లో దీపికను డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలిపిన ఆయన, సాయి పల్లవి కోసం అంతకంటే బలమైన సీన్‌లను డిజైన్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks