సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే తాజాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ఇది కాస్తా శృతిమించి ఆమెను భయాందోళనకు గురిచేసే స్థాయికి చేరింది. ఫ్యాన్స్, మీడియా వెంటపడటంతో ఆమె వారి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి కలిగింది.
సాయి పల్లవి బతిమాలినా వినని జనం..

సాయి పల్లవి కొచ్చిలో ల్యాండ్ అవ్వగానే ఆమెను చూడటానికి, ఫోటోలు తీయడానికి భారీ సంఖ్యలో యూట్యూబ్ మీడియా, అభిమానులు ఎయిర్‌పోర్ట్ బయట వేచి ఉన్నారు. ఇది గమనించిన సాయి పల్లవి.. తన కారు వచ్చే వరకు లోపలే వెయిట్ చేశారు.
అక్కడున్న సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది.. "దయచేసి కొంచెం వెనక్కి వెళ్లండి, నేను మిమ్మల్ని నెట్టాలని అనుకోవట్లేదు" అని చెబుతున్న మాటలు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాయి పల్లవిని పదే పదే క్లిక్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లను పక్కకు పంపించడానికి ఆ భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
చివరికి సాయి పల్లవి బయటకు వచ్చి, తనకు కొంచెం దారి ఇవ్వాలని వారిని బతిమాలడం ప్రారంభించింది. "ఒక్క నిమిషం, నా కారు అక్కడుంది. నేను అక్కడికి వెళ్లాలి" అని ఆమె చెప్పడం వీడియోలో వినిపిస్తుంది. ఆమెను వేరే వైపుకు వచ్చి నిలబడాలని ఫోటోగ్రాఫర్లు అడగగా.. "వద్దు, మీరు ఇక్కడి నుంచే ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఎవరినీ తోయకండి" అని ఆమె ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చింది. ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా గుంపును అదుపు చేయడానికి ప్రయత్నించారు.
పరుగెత్తుకుంటూ వెళ్లిన నటి
సాయి పల్లవి ఎంతగా బతిమాలినా, ఆ గుంపును ఎక్కువసేపు కంట్రోల్ చేయలేకపోయింది. ఆమె కారు రాగానే, ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ "మేడమ్, మేడమ్.. ప్లీజ్" అంటూ అరుస్తూ ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు. 'ప్రేమమ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రను గుర్తుచేస్తూ కొందరు ఆమెను 'మలర్ మిస్' (Malar Miss) అని కూడా పిలిచారు.
{{/usCountry}}సాయి పల్లవి ఎంతగా బతిమాలినా, ఆ గుంపును ఎక్కువసేపు కంట్రోల్ చేయలేకపోయింది. ఆమె కారు రాగానే, ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ "మేడమ్, మేడమ్.. ప్లీజ్" అంటూ అరుస్తూ ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు. 'ప్రేమమ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రను గుర్తుచేస్తూ కొందరు ఆమెను 'మలర్ మిస్' (Malar Miss) అని కూడా పిలిచారు.
{{/usCountry}}పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన సాయి పల్లవి.. అక్కడినుంచి తప్పించుకునేందుకు తన కారు వైపు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అలా వెళ్తూ కూడా ఆమె ఎంతో వినమ్రంగా, వారందరికీ చేయి ఊపుతూ వీడ్కోలు పలకడం ఆమె సింప్లిసిటీకి అద్దం పడుతోంది.
నెటిజన్ల ఫైర్.. 'వాళ్లంతా జాంబీలే'
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రెడిట్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లు ఆ ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ పబ్లిక్ న్యూసెన్స్‌ను ఉద్దేశించి "ఈ మూర్ఖులు సమాజానికి పట్టిన పీడ" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. "ఈ మూర్ఖులను కట్టడి చేయడానికి కచ్చితంగా ఏదైనా చట్టం తీసుకురావాలి" అని మరొకరు రాసుకొచ్చారు.
ఒక యూజర్ వారిని వేటాడే జంతువులతో పోల్చగా.. మరొకరు "ఇది నిజంగా మతిస్థిమితం లేని ప్రవర్తన" అని దుయ్యబట్టారు. ఆ గుంపు చేసిన పనిని చూసి "అక్షరాలా వాళ్లంతా జాంబీల్లాగే ప్రవర్తించారు" అంటూ ఏకిపారేస్తున్నారు.
అలాగే "సాయి పల్లవికి బహుశా నటుడు షైన్ టామ్ చాకో స్పూర్తినిచ్చాడేమో" అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశారు (గతంలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఈ మలయాళ నటుడు ఓ హోటల్ నుంచి పరుగెత్తిన సంఘటనను గుర్తుచేస్తూ..).
పెరుగుతున్న 'సెలబ్రిటీ మాబింగ్' ఘటనలు..
ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాలు, ప్రమోషనల్ ఈవెంట్లలో ఇలా సెలబ్రిటీలను జనం విపరీతంగా చుట్టుముట్టే సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల పబ్లిక్ స్పేస్‌లలో నటీనటుల భద్రత ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.
కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో నిధి అగర్వాల్, సమంత రూత్ ప్రభు, అల్లు అర్జున్, దళపతి విజయ్ మరియు రామ్ చరణ్ వంటి అగ్రశ్రేణి నటీనటులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. స్టార్స్ కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం, ఫోటోల కోసం ఎగబడుతున్న ఈ ఫ్యాన్ కల్చర్‌పై, తద్వారా తలెత్తుతున్న భద్రతా లోపాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.