Sai Pallavi Ramayana Remuneration: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణం'. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో.. సీతమ్మ పాత్రను సాయి పల్లవి పోషిస్తున్న సంగతి తెలిసిందే.
సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంత?

అందచందాల కంటే నటనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి పారితోషికం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. జాతీయ మీడియా, పలు ప్రముఖ వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. రామాయణం సిరీస్ (మొత్తం భాగాలు కలుపుకుని) కోసం సాయి పల్లవి ఏకంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
అంటే ఒక్కో భాగానికి సగటున రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు సాయి పల్లవి పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లకు ఈ స్థాయిలో బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ లభించడం చాలా అరుదైన విషయం.
సాయి పల్లవికి అంత డిమాండ్ ఎందుకు?
కమర్షియల్ సినిమాల మోజులో పడి గ్లామర్ షో చేసే ప్రస్తుత తరం హీరోయిన్లకు భిన్నంగా, సాయి పల్లవి తనదైన ముద్ర వేస్తోంది. ఆమె కథ నచ్చితేనే ఏ సినిమాకైనా ఓకే చెబుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. అందుకే ఆమెకు స్టార్ హీరోలతో సమానమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'అమరన్', 'తండేల్' వరకు ఆమె ఎంచుకున్న కథలే సాయి పల్లవి బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేశాయి.
ఇలా ఎదిగింది?
{{/usCountry}}ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'అమరన్', 'తండేల్' వరకు ఆమె ఎంచుకున్న కథలే సాయి పల్లవి బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేశాయి.
ఇలా ఎదిగింది?
{{/usCountry}}కెరీర్ మొదట్లో సాయి పల్లవి పారితోషికం లక్షల్లో మాత్రమే ఉండేది. నైతిక విలువలకు పెద్దపీట వేసే సాయి పల్లవి.. గతంలో తాను నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమా ఫ్లాప్ అయి.. నిర్మాత నష్టపోతే, తన రెమ్యునరేషన్ లోని రూ.40 లక్షలను వెనక్కి ఇచ్చేసి గొప్ప మనసు చాటుకుంది.
అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం, నటనతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఆమె గత సినిమాలతో పోలిస్తే రామాయణం సినిమాకు తీసుకుంటున్న పారితోషికం దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. కేవలం అందం మాత్రమే కాదు, అద్భుతమైన టాలెంట్, క్రమశిక్షణ ఉంటే సక్సెస్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని సాయి పల్లవి నిరూపించింది.