Sai Pallavi: రామాయణ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా, మరోవైపు బీఆర్ చోప్రా 'మహాభారత్'లో భీష్ముడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా ఈ చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేసిన ముకేష్ ఖన్నా.. సినిమా మేకర్స్ అనుసరించిన తీరును, కథలో చేసిన మార్పులను తప్పుబట్టారు.
“రూ.4000 కోట్లు ఎలా రాబట్టాలనేదే మేకర్స్ ధ్యేయం”

ముకేష్ ఖన్నా మాట్లాడుతూ.. "రామాయణం సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లపైనే చర్చ జరుగుతోంది. రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఎలాగైనా బిజినెస్ పరంగా విజయవంతం చేసుకోవాలనే తపన మేకర్స్‌లో కనిపిస్తోంది తప్ప.. పౌరాణిక మూలాలను కాపాడే ప్రయత్నం కనిపించడం లేదు. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు.. కానీ గత 5-6 రోజులుగా వస్తున్న రివ్యూలు, ప్రోమోలు చూశాక నాకు ఈ సినిమా చూడకూడదనిపించింది. నేను థియేటర్‌కు వెళ్లి టికెట్లు కొని నిర్మాతలకు లాభం చేకూర్చాలనుకోవడం లేదు" అని వ్యాఖ్యానించారు.
సీతాదేవి యాక్షన్ సీన్‌పై మండిపడ్డ ముకేష్ ఖన్నా
సినిమాలో సాయి పల్లవి పోషించిన సీతాదేవి పాత్రతో ఫైట్ సీక్వెన్సులు చేయించడంపై ముకేష్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "వాల్మీకి రామాయణంలో సీతాదేవి యుద్ధాలు చేసినట్లు ఎక్కడా లేదు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి భార్యగా ఆమె ఏ తప్పూ చేయకపోయినా 14 ఏళ్లు భర్తతో కలిసి వనవాసానికి వెళ్లిన సాధ్వి. అలాంటి పవిత్ర పాత్రను ఫైటర్‌గా ఎలా చూపిస్తారు?" అని ప్రశ్నించారు.
"ఒకవేళ సీతాదేవే ఫైటర్ అయితే, రావణాసురుడు ఆమెను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు పోరాడలేదు? రావణుడిని ఎందుకు ఎదురించలేదు?" అని నిలదీశారు. "మేకర్స్ విచిత్రంగా 'అద్భుత రామాయణం' ఆధారంగా ఈ సీన్ తీశామని చెబుతున్నారు. నేను మేకర్స్‌ను ఒక్కటే అడుగుతున్నా.. ఖురాన్ లేదా బైబిల్లోని అంశాలతో ఇలాంటి స్వేచ్ఛ తీసుకునే ధైర్యం మీకు ఉందా? మన రామాయణంతోనే ఎందుకు ఈ ప్రయోగాలు? మీకు నిజంగా సిగ్గుండాలి" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యశ్ రావణాసురుడి ఎలివేషన్లు, అనుపమ్ ఖేర్‌పై ట్విస్ట్
{{/usCountry}}"ఒకవేళ సీతాదేవే ఫైటర్ అయితే, రావణాసురుడు ఆమెను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు పోరాడలేదు? రావణుడిని ఎందుకు ఎదురించలేదు?" అని నిలదీశారు. "మేకర్స్ విచిత్రంగా 'అద్భుత రామాయణం' ఆధారంగా ఈ సీన్ తీశామని చెబుతున్నారు. నేను మేకర్స్‌ను ఒక్కటే అడుగుతున్నా.. ఖురాన్ లేదా బైబిల్లోని అంశాలతో ఇలాంటి స్వేచ్ఛ తీసుకునే ధైర్యం మీకు ఉందా? మన రామాయణంతోనే ఎందుకు ఈ ప్రయోగాలు? మీకు నిజంగా సిగ్గుండాలి" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యశ్ రావణాసురుడి ఎలివేషన్లు, అనుపమ్ ఖేర్‌పై ట్విస్ట్
{{/usCountry}}సినిమాలో రణబీర్ కపూర్ కంటే రావణాసురుడిగా నటించిన యశ్ కే ఎక్కువ ప్రశంసలు రావడంపైనా ముకేష్ ఖన్నా స్పందించారు. యశ్ నటనను అందరూ మెచ్చుకోవడానికి కారణం ఆయన నటన మాత్రమే కాదు, స్క్రిప్ట్‌లో రావణాసురుడి పాత్రను శ్రీరాముడి కంటే ఎక్కువ ఎలివేట్ చేస్తూ రాసుకోవడమే అని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాను ఆకాశానికెత్తడంపై స్పందిస్తూ.. "అంత పెద్ద నటుడు ఈ సినిమాను అంతగా ఎందుకు పొగుడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే.. సినిమాలో 'జటాయువు' పాత్రకు అనుపమ్ ఖేర్ డబ్బింగ్ చెప్పారు. అందుకే ఆయన అంతగా పొగుడుతున్నారు. అందుకే ఆయన రివ్యూను నేను అస్సలు పరిగణనలోకి తీసుకోను" అని తేల్చి చెప్పారు.
పౌరాణిక కావ్యాలను వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు భక్తి భావం, సాంప్రదాయ పరిమితులు పాటించాలని, కేవలం విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సుల కోసం మూల కథను మార్చడం సరైంది కాదని ముకేష్ ఖన్నా వ్యాఖ్యానించారు.