...
...
Next Story

Salman Khan: బాడీగార్డు కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్న సల్మాన్ ఖాన్.. సల్లూ భాయ్ రూటే వేరంటున్న నెటిజన్లు!

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన బాడీగార్డు కొడుకును ఆయన హీరోగా లాంఛ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సల్లూ భాయ్ రూటే వేరు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published on: Sep 14, 2026, 06:01:46 IST
Advertisement

Salman Khan: బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ సల్మాన్ ఖాన్ రూట్ మాత్రం సెపరేట్. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే సల్లూ భాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన బాడీగార్డు కొడుకును ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం.

సల్మాన్ బాడీగార్డు కొడుకు

బాడీగార్డు కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్న సల్మాన్ ఖాన్.. సల్లూ భాయ్ రూటే వేరంటున్న నెటిజన్లు! (AFP)
బాడీగార్డు కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్న సల్మాన్ ఖాన్.. సల్లూ భాయ్ రూటే వేరంటున్న నెటిజన్లు! (AFP)

సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అయ్యే పర్సనల్ బాడీగార్డ్ షేరా (గుర్మీత్ సింగ్ జాలీ) కొడుకు అబీర్ సింగ్ (Abir Singh) ని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. బి-టౌన్ రిపోర్ట్స్ ప్రకారం.. అబీర్ సింగ్ హీరోగా 'టార్జాన్' (Tarzan) పేరుతో ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో 'హీరో' ఫేమ్ సూరజ్ పంచోలి మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

అబీర్ సింగ్ డ్రీమ్ లాంచ్

గతంలోనే షేరా కుమారుడు అబీర్ సింగ్‌ను సినీ రంగానికి పరిచయం చేస్తానని సల్మాన్ ఖాన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన సెక్యూరిటీ చూసుకుంటున్న షేరా పట్ల ఉన్న ప్రేమతో సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే అబీర్ కోసం ప్రత్యేకంగా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది.

గతంలో 'హీరో' (Hero) చిత్రంతో సల్మాన్ ఖాన్ స్వయంగా లాంచ్ చేసిన సూరజ్ పంచోలికి కూడా ఈ సినిమా కెరీర్ పరంగా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది.

ఆ పాపులారిటీ

సాధారణంగా స్టార్ కిడ్స్ లేదా ఇన్సైడర్స్ రొమాంటిక్ సినిమాలతో వస్తుంటారు. కానీ అబీర్ సింగ్‌ను 'టార్జాన్' వంటి హై-వోల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ టైటిల్‌తో పరిచయం చేయడం ద్వారా నార్త్ మాస్ బెల్ట్‌లో బలమైన రీచ్ సాధించవచ్చని సల్మాన్ అండ్ టీమ్ భావిస్తోంది.

సల్మాన్ రూట్

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. సీనియర్ నటీనటుల పిల్లలు బాలీవుడ్ డెబ్యూ చేస్తుంటారు. వీళ్లను ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఫిల్మ్ మేకర్స్ పోటీపడుతుంటారు. కానీ ఓ మామూలు బాడీగార్డు కొడుకు కోసం సల్మాన్ ఖాన్ ముందుకు రావడం వైరల్ గా మారింది. సల్మాన్ రూట్ సెపరేట్ అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks