...
...
Next Story

Salman Khan Cameo: తలపాగా, మీసంతో సల్మాన్ ఖాన్ సర్‌ప్రైజ్- శివాజీని కాపాడే జీవా మహాలాగా సల్లూ భాయ్ ఎంట్రీ అదుర్స్!

Salman Khan Cameo In Raja Shivaji Movie: జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం 'రాజా శివాజీ'లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అత్యంత రహస్యంగా ఉంచిన ఈ అతిథి పాత్ర థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన పూనకాలు తెప్పిస్తోంది.

Published on: May 1, 2026, 15:26:26 IST
Advertisement

Salman Khan Guest Role Surprises In Raja Shivaji Movie: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం'రాజా శివాజీ'. హీరోయిన్ జెనీలియా భర్త, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ టైటిల్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాజా శివాజీ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి అభిమానుందలరిని ఆశ్చర్యపరిచాడు.

తలపాగా, మీసంతో సల్మాన్ ఖాన్

తలపాగా, మీసంతో సల్మాన్ ఖాన్ సర్‌ప్రైజ్- శివాజీని కాపాడే జీవా మహాలాగా సల్లూ భాయ్ ఎంట్రీ అదుర్స్! (X)
తలపాగా, మీసంతో సల్మాన్ ఖాన్ సర్‌ప్రైజ్- శివాజీని కాపాడే జీవా మహాలాగా సల్లూ భాయ్ ఎంట్రీ అదుర్స్! (X)

రాజా శివాజీ మూవీలో 'జీవా మహాలా' అనే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. తలకు కాషాయ రంగు తలపాగా, కుర్తా ధరించి, చేతిలో మరాఠా కత్తి పట్టుకుని మీసంతో సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

రాజా శివాజీ సినిమా విడుదలకు ముందు ఈ విషయంపై ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. ఇప్పుడు వెండితెరపై సల్మాన్‌ను చూడగానే అభిమానులు ఆ క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. "సినిమా అంతా ఒక ఎత్తు.. భాయ్ ఎంట్రీ మరో ఎత్తు" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఈ రోల్ వెనుక ఆసక్తికర కథ

అసలు ఈ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎలా వచ్చారో రితేష్ దేశ్‌ముఖ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక కొత్త సంవత్సరం వేడుకలో సల్మాన్, రితేష్ కలిసినప్పుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చిందట.

"షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నావు? నా పాత్ర ఏంటి?" అని సల్మాన్ ఖాన్ అడగ్గా.. ఆయన కోసం ప్రత్యేకంగా ఏ పాత్ర అనుకోలేదని రితేష్ సమాధానమిచ్చారు. దానికి సల్మాన్ స్పందిస్తూ.. "నేను లేకుండా ఈ సినిమా ఎలా తీస్తావు? కచ్చితంగా నేను ఇందులో ఉండాల్సిందే" అని పట్టుబట్టారట సల్మాన్. రాజా శివాజీ సినిమాపై సల్మాన్‌కు ఉన్న గౌరవం, రితేష్‌తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ ప్రత్యేక పాత్ర రూపుదిద్దుకుంది.

జీవా మహాలా ప్రాముఖ్యత

జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన రాజా శివాజీ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ శివాజీ మహారాజ్‌గా నటించారు. శివాజీని కాపాడే జీవా మహాలా పాత్రలోనే సల్లూ భాయ్ యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయిందని టాక్ వస్తోంది. సల్మాన్‌తో పాటు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, భాగ్యశ్రీ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించడం విశేషం.

శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన పోరాటాన్ని, ఆయన వ్యూహాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం రాజా శివాజీ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రాజా శివాజీ సినిమాలో సల్మాన్ ఖాన్ ఏ పాత్ర పోషించారు?

సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంగరక్షకుడు, అత్యంత నమ్మకస్తుడైన 'జీవా మహాలా' పాత్రలో అతిథిగా కనిపించారు.

2. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు?

నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, శివాజీ మహారాజ్ పాత్రను కూడా ఆయనే పోషించారు.

3. రాజా శివాజీ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు?

ఈ చారిత్రాత్మక చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, బోమన్ ఇరానీ, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks