...
...
Next Story

Maatrubhumi OTT: నేరుగా ఓటీటీలోకే సల్మాన్ ఖాన్ మాతృభూమి- సెన్సార్ భయంతోనే రిలీజ్- క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్!

Salman Khan Maatrubhumi OTT Release Clarity: బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం 'మాతృభూమి' థియేటర్లను కాదని నేరుగా ఓటీటీలోకి వస్తోందన్న వార్తలపై చిత్ర బృందం స్పందించింది. వివాదాల నేపథ్యంలో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ మాతృభూమి ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చింది.

Published on: Apr 16, 2026, 14:10:21 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యుద్ధ ప్రాతిపదికన సాగే యాక్షన్ డ్రామా 'మాతృభూమి' చుట్టూ గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

నేరుగా ఓటీటీలోకే సల్మాన్ ఖాన్ మాతృభూమి- సెన్సార్ భయంతోనే రిలీజ్- క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్!
నేరుగా ఓటీటీలోకే సల్మాన్ ఖాన్ మాతృభూమి- సెన్సార్ భయంతోనే రిలీజ్- క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్!

ముఖ్యంగా ఈ సినిమా నుంచి చైనాకు సంబంధించిన ప్రస్తావనలను తొలగించారని, అందుకే థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా మాతృభూమి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్‌కు చెందిన కీలక వ్యక్తులు స్పందించారు.

ఓటీటీ వార్తల్లో వాస్తవం లేదు

సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఎప్పుడూ భారీ స్థాయిలో వెండితెరకు తగినట్టుగా నిర్మిస్తారని, మాతృభూమిని కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని సినిమా వర్గాలు స్పష్టం చేశాయి.

"సల్మాన్ ఇప్పటికీ మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్ మెగాస్టార్. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్న మాట నిజమే కానీ, వాటిని పరిష్కరించుకుని థియేటర్లలోనే వస్తాం" అని చిత్ర బృందానికి చెందిన ఒక సభ్యుడు పేర్కొన్నారు.

ఓటీటీలో కూడా సెన్సార్ తప్పదు

సాధారణంగా థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయని, ఓటీటీలో విడుదల చేస్తే అలాంటి సమస్యలు ఉండవనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిపై ఇండస్ట్రీ విశ్లేషకులు స్పందిస్తూ.. "ఒక చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లినా సరే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్టిఫికేషన్ ప్రక్రియను దాటాల్సిందే. ఓటీటీలో కూడా విచ్చలవిడిగా ప్రదర్శించే అవకాశం ఉండదు. కాబట్టి సెన్సార్ భయంతో ఓటీటీకి వెళ్తున్నారన్న వాదనలో నిజం లేదు" అని విశ్లేషిస్తున్నారు.

'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' నుంచి 'మాతృభూమి'గా..

దాంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా పేరును 'మాతృభూమి'గా మార్చడమే కాకుండా, చైనా ప్రస్తావన లేకుండా కేవలం భారత సైనికుల ధైర్యసాహసాలను చూపించేలా మార్పులు చేసినట్లు సమాచారం.

మాతృభూమి రిలీజ్ డేట్

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్ చిత్రాంగద సింగ్ నటిస్తోంది. ఒక పక్క దేశభక్తి, మరోపక్క భావోద్వేగమైన కుటుంబ అనుబంధాల కలయికగా ఈ చిత్రం రూపొందింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మాతృభూమి మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks