...
...
Next Story

మరో 6 రోజుల్లో 60 ఏళ్లు.. సల్మాన్ ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూడండి.. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ మరో 6 రోజుల్లో తన 60వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. అయితే ఇప్పుడు కూడా అతని ఫిట్‌నెస్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. తన ఫొటోలతో అతడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Dec 22, 2025, 19:20:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 60వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు షేర్ చేసిన లేటెస్ట్ జిమ్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే వార్ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ @ 60 ఏళ్లు

మరో 6 రోజుల్లో 60 ఏళ్లు.. సల్మాన్ ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూడండి.. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్
మరో 6 రోజుల్లో 60 ఏళ్లు.. సల్మాన్ ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూడండి.. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్

బాలీవుడ్ ఖాన్ త్రయం (షారుఖ్, ఆమిర్, సల్మాన్)లో చివరగా సల్మాన్ ఖాన్ ఈ ఏడాది 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. మరో ఆరు రోజుల్లో అంటే డిసెంబర్ 27న అతడు షష్టిపూర్తి చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ చేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

"60 ఏళ్లకు ఇలా ఉండాలని ఉంది.."

సల్మాన్ ఖాన్ తన జిమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టాడు. "ఇంకా 6 రోజుల్లో నాకు 60 ఏళ్లు వస్తున్నాయి.. అప్పటికి నేను ఇలాగే (ఫిట్‌గా) ఉండాలని కోరుకుంటున్నాను" అని చమత్కరించాడు.

ఈ ఫొటొల్లో అతడు బ్లాక్ వెస్ట్, బ్లూ షార్ట్స్ వేసుకుని.. కండలు తిరిగిన చేతులు, బలమైన కాళ్లతో జిమ్‌లో కూర్చొని ఉన్నాడు. క్లీన్ షేవ్ లుక్‌లో ఉన్న సల్మాన్‌ను చూసి.. "మీరు ఇప్పుడు జస్ట్ 30 ఏళ్ల కుర్రాడిలా ఉన్నారు భాయ్" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాదే ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పుట్టినరోజులకు పాత సినిమాలు రీ-రిలీజ్ చేశారు కానీ, సల్మాన్ బర్త్‌డేకి ఇంకా అలాంటి ప్లాన్స్ ఏవీ ప్రకటించలేదు.

సల్మాన్ ఖాన్ నెక్ట్స్ మూవీ

'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' ఫేమ్ అపూర్వ లాఖియా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ గురించి సల్మాన్ గతంలో మాట్లాడాడు.

"ఇది శారీరకంగా చాలా కష్టమైన సినిమా. వయసు పెరిగేకొద్దీ యాక్షన్ చేయడం కష్టంగా మారుతోంది. ఇంతకుముందు ఒకటి రెండు వారాల్లో చేసే పనులు.. ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. పరుగెత్తడం, కిక్ చేయడం వంటివి ఈ సినిమా కోసం తప్పక చేయాల్సి వస్తోంది" అని సల్మాన్ పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks