Salman Khan: అయిపోయింది బ్రో.. ఇక చాలు.. దీక్ష ఆపెయ్.. నా ఇంటి నుంచి భోజనం పంపిస్తా: సోనమ్ వాంగ్చుక్‌కు సల్మాన్ మెసేజ్

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ కు తనదైన స్టైల్లో ఓ మెసేజ్ పంపించాడు. ఇక చాలు.. అయిపోయింది.. దీక్ష ఆపెయ్.. కావాలంటే తన ఇంటి నుంచి భోజనం పంపిస్తానని అనడం విశేషం.

Published on: Jul 23, 2026, 21:01:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Salman Khan: దేశవ్యాప్తంగా రగులుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుగ్రామ్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే దీక్ష విరమించాలని సల్మాన్ విజ్ఞప్తి చేశారు. "ఇక చాలు బ్రో.. మా ఇంటి నుంచి నీకు కడుపునిండా తిండి పంపిస్తా" అంటూ భాయ్‌జాన్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Salman Khan: అయిపోయింది బ్రో.. ఇక చాలు.. దీక్ష ఆపెయ్.. నా ఇంటి నుంచి భోజనం పంపిస్తా: సోనమ్ వాంగ్చుక్‌కు సల్మాన్ మెసేజ్
Salman Khan: అయిపోయింది బ్రో.. ఇక చాలు.. దీక్ష ఆపెయ్.. నా ఇంటి నుంచి భోజనం పంపిస్తా: సోనమ్ వాంగ్చుక్‌కు సల్మాన్ మెసేజ్

"ఇంటికి వెళ్లిపోండి పిల్లలు!" - సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశంలోని యువత అంతా ఒక్కటి కావడం సంతోషకరమైన విషయమే అని నిన్న వ్యాఖ్యానించిన సల్మాన్.. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగినందున విద్యార్థులు ఇక ఆందోళన చెందకుండా తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు.

సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. దేశంలో విద్యార్థుల భద్రత, చదువు మాత్రమే ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ఆయన పేర్కొన్నారు. పిల్లలు ఆందోళన చెందుతూ తమ కన్నవారిని భయాందోళనలకు గురిచేయకూడదని సూచించారు.

"మన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అందుకే విద్యార్థులందరూ వెంటనే నిరసనలు ఆపి ప్రశాంతంగా తమ ఇళ్లకు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని కోరుతున్నాను" అని సల్మాన్ రాసుకొచ్చారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కి స్పెషల్ రెక్వెస్ట్

సుదీర్ఘంగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ని ఉద్దేశించి సల్మాన్ ఎమోషనల్ అయ్యారు. "సోనమ్.. ఇక చాలు బ్రో! ఈ దీక్షను ఇంతటితో ఆపేయ్. రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ పోరాట స్ఫూర్తిని మళ్లీ చూపిద్దాం. వెంటనే ఏదైనా తిను. నీకు కావాలంటే మా ఇంటి నుంచే రుచికరమైన ఫుడ్ పంపిస్తాను" అంటూ సల్మాన్ ఆఫర్ ఇచ్చారు.

ఆస్పత్రి బెడ్ నుంచే పోరాటం.. అసలు ఏం జరిగింది?

లడఖ్‌కు చెందిన ప్రసిద్ధ పర్యావరణ, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ముందుగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్ మీద నుంచే సోనమ్ తన దీక్షను కొనసాగించడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దాదాపు 65 మంది ఎంపీలు సంతకాలు చేసిన లేఖతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరారు.

ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు!

ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (జులై 23) అఫీషియల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీకులకు పాల్పడే నేరస్థులను అత్యంత వేగంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తు కంటే మరేదీ ఎక్కువ కాదని, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ ఇచ్చిన ఈ హామీ తర్వాతే సల్మాన్ ఖాన్ సోనమ్ వాంగ్‌చుక్‌కి, విద్యార్థులకు ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. సామాజిక అంశాలపై సల్మాన్ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More