బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ అంతర్జాతీయ వేదికలపై తన ముద్రను వేయడం కొనసాగిస్తోంది. తాజాగా లండన్‌లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA 2026) వేదికపై ఆమె అవార్డ్ ప్రజెంటర్‌గా మెరిశారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును అందించే ముందు అలియా తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి భారతీయ అభిమానుల మనసు గెలుచుకున్నారు.
అలియాకు సమంత ‘చీర్స్’

అలియా భట్ హిందీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ అలియా భట్‌పై ప్రశంసలు కురిపించారు.
ఒక వైట్ హార్ట్ ఎమోజీని జోడించి అలియాను ట్యాగ్ చేశారు. ఇలా హాలీవుడ్ వేదిక అయిన బఫ్తా అవార్డ్ వేడుకల్లో అలియా భట్ హిందీ స్పీచ్‌ను సమంత పొగడటం వైరల్‌గా మారింది.
నిజానికి అలియాను సమంత సమర్థించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆలియా చిత్రం ‘జిగ్రా’పై విమర్శలు వచ్చినప్పుడు కూడా సమంత అండగా నిలిచారు.
"నువ్వు ఒక ఆడపులివి (Tigress).. నీ నటన నుంచి కళ్లు తిప్పుకోలేకపోతున్నాను.. నీ ధైర్యవంతమైన నిర్ణయాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం" అంటూ అలియాను అప్పట్లో ప్రశంసల్లో ముంచెత్తారు సమంత.
మర్లిన్ మన్రో లుక్‌లో ఆలియా సందడి
ఇకపోతే ఈ అవార్డు వేడుక కోసం ఆలియా వెండి రంగు సీక్విన్ గౌను ధరించి, దానిపై వైట్ ఫర్ స్టోల్ (fur stole) వేసుకున్నారు. లెజెండరీ నటి మర్లిన్ మన్రో స్టైల్‌ను తలపించేలా ఉన్న ఈ లుక్‌లో అలియా ఎంతో అందంగా కనిపించారు.
స్టేజ్ పైకి వచ్చిన ఆలియా.. "నమస్కార్! అగ్లా అవార్డ్ ఏక్ ఐసీ ఫిల్మ్ కే లియే హై, జో అంగ్రేజీ మే నహీ హై" (తదుపరి అవార్డు ఇంగ్లీష్‌లో లేని చిత్రం కోసం) అంటూ హిందీలో మొదలుపెట్టారు.
{{/usCountry}}స్టేజ్ పైకి వచ్చిన ఆలియా.. "నమస్కార్! అగ్లా అవార్డ్ ఏక్ ఐసీ ఫిల్మ్ కే లియే హై, జో అంగ్రేజీ మే నహీ హై" (తదుపరి అవార్డు ఇంగ్లీష్‌లో లేని చిత్రం కోసం) అంటూ హిందీలో మొదలుపెట్టారు.
{{/usCountry}}ఆ తర్వాత నవ్వుతూ.. "అప్పుడే సబ్‌టైటిల్స్ కోసం వెతకకండి. సినిమాకు ఎన్ని గళాలు ఉన్నా, మనం జరుపుకునేది సినిమా భాషనే.. ఆ భాష మనందరికీ స్పష్టంగా తెలుసు" అంటూ ఇంగ్లీష్ భాషా చిత్రాలు కాని విభాగంలో నామినీలను ప్రకటించారు.
సినిమా విశేషాలు
కెరీర్ విషయానికొస్తే.. సమంత త్వరలో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక సాదాసీదా గృహిణిగా కనిపిస్తూనే విలన్ల అంతు చూసే తీసే పాత్రలో నటించారు. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. అలాగే రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్’లోనూ సమంత నటిస్తున్నారు.
మరోవైపు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న అలియా భట్ గంగూభాయి కతియావాడి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’ (Alpha)లో నటిస్తున్నారు. శార్వరీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. వీటితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ ఆలియా నటించనున్నారు.