Rashmika Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ సమంత రుత్ ప్రభు, రష్మిక మందన్న ఇద్దరూ తమ వివాహాల తర్వాత కెరీర్ పరంగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. డిసెంబర్ 2025లో రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 2026లో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్స్ తర్వాత తమ ఫస్ట్ మూవీస్ తో సమంత, రష్మిక థియేటర్లలోకి వచ్చారు.
ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్

సమంత, రష్మిక మందన్న ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్ కు దిగారు. సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ‘మా ఇంటి బంగారం’ మూవీ, రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా ‘కాక్‌టెయిల్ 2’ జూన్ 19న రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో మా ఇంటి బంగారం చిత్రంతో సమంత బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ కాక్‌టెయిల్ 2 ఫ్లాప్ తో రష్మిక మందన్నకు నిరాశ తప్పలేదు.
మూవీస్ కంపారిజన్
- మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)
హీరోయిన్: సమంత రుత్ ప్రభు
దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి
చిత్ర బడ్జెట్: దాదాపు రూ.35 - 40 కోట్లు
ప్రపంచవ్యాప్త వసూళ్లు: ₹85.27+ కోట్లు (రెండు వారాల్లో)
బాక్సాఫీస్ స్టేటస్: హిస్టారికల్ బ్లాక్‌బస్టర్
- కాక్‌టెయిల్ 2 (Cocktail 2)
హీరోయిన్: రష్మిక మందన్న (షాహిద్ కపూర్, కృతి సనన్)
దర్శకత్వం: హోమి అడజానియా
చిత్ర బడ్జెట్: రూ.150 కోట్లు
ప్రపంచవ్యాప్త వసూళ్లు: రూ.128.11 కోట్లు
{{/usCountry}}ప్రపంచవ్యాప్త వసూళ్లు: రూ.128.11 కోట్లు
{{/usCountry}}బాక్సాఫీస్ స్టేటస్: అండర్ పర్ఫార్మర్ (బడ్జెట్ రికవరీ కాలేదు)
సమంత సరికొత్త చరిత్ర!
బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డిలతో కలిసి) పై నిర్మిస్తూ లీడ్ రోల్ పోషించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సాంప్రదాయ కుటుంబంలో ఉండే ఒక కోడలి యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సమంత తన వన్ విమెన్ షోతో థియేటర్లలో నవ్వులు, ఎమోషన్స్ పూయించింది.
ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.85.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీని ద్వారా 17 ఏళ్ల క్రితం అనుష్క శెట్టి 'అరుంధతి' (రూ.70 కోట్లు) సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రాధాన్యత (Women-led) చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ హిస్టారికల్ రికార్డు సృష్టించింది.
రష్మికకు షాక్
మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ‘కాక్‌టెయిల్ 2’ కేవలం 9 రోజుల్లోనే రూ.120 కోట్ల క్లబ్‌లో చేరి, 2012 నాటి ఒరిజినల్ 'కాక్‌టెయిల్' లైఫ్ టైమ్ కలెక్షన్లను (రూ.71 కోట్లు) దాటేసింది. కానీ రూ.150 కోట్ల భారీ బడ్జెట్ కావడం, రెండో వారం నుంచి స్క్రీన్ కౌంట్ భారీగా పడిపోవడంతో థియేట్రికల్ పరంగా ఇది ట్రేడ్‌కు నష్టాలనే మిగిల్చింది.