...
...
Next Story

Samantha: సమంత మా ఇంటి బంగారంకు తొలిరోజే 10 కోట్ల కలెక్షన్స్- సోలో హీరోయిన్‌గా రికార్డ్- అనుష్క, రష్మిక సినిమాలు అవుట్!

Samantha Maa Inti Bangaaram Box Office Collection Day 1: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. అనుష్క, రష్మిక సినిమాల రికార్డులను వెనక్కి నెడుతూ సమంత తన కెరీర్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

Published on: Jun 20, 2026, 09:13:28 IST
Advertisement

Samantha Maa Inti Bangaaram Box Office Collection Day 1: టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మార్కెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' థియేటర్లలో మంచి బాక్సాఫీస్ కలెక్షన్లతో స్టార్ట్ అయింది.

భారీ ఓపెనింగ్స్

సమంత మా ఇంటి బంగారంకు తొలిరోజే 10 కోట్ల కలెక్షన్స్- సోలో హీరోయిన్‌గా రికార్డ్- అనుష్క, రష్మిక సినిమాలు అవుట్!
సమంత మా ఇంటి బంగారంకు తొలిరోజే 10 కోట్ల కలెక్షన్స్- సోలో హీరోయిన్‌గా రికార్డ్- అనుష్క, రష్మిక సినిమాలు అవుట్!

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో శుక్రవారం (జూన్ 19) విడుదలైన మా ఇంటి బంగారం సినిమా తొలిరోజే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయి వసూళ్లను రాబట్టింది. కమర్షియల్ సినిమాలకు దీటుగా మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు కూడా భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల సత్తా తనకుందని సమంత మరోసారి నిరూపించింది.

చిత్ర పరిశ్రమ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 5.35 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అలాగే, రూ. 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఇండియాలో రాబట్టింది ఈ సినిమా. శుక్రవారం దేశవ్యాప్తంగా మొత్తం 2,658 షోలలో సగటున 36 శాతం ఆక్యుపెన్సీతో ఈ చిత్రం రన్ అయింది.

సమంత కెరీర్‌లోనే

సమంత కెరీర్‌లోనే సోలో హీరోయిన్‌గా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. 2022లో వచ్చిన డిస్టోపియన్ థ్రిల్లర్ 'యశోద' తొలిరోజు రూ. 3.06 కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును ఈ సరికొత్త యాక్షన్ డ్రామా సులువుగా అధిగమించింది.

అనుష్క, రష్మిక చిత్రాల రికార్డులు బద్దలు

గతంలో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ 'ఓ బేబీ' (2019) తొలిరోజు వసూలు చేసిన రూ. 2.5 కోట్ల రికార్డు కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇక వరల్డ్ వైడ్‌గా తొలి రోజు మా ఇంటి బంగారం సినిమాకు రూ. 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఓవర్సీస్ కలెక్షన్స్

అలాగే, ఓవర్సీస్‌లో రూ. 4.50 కోట్ల గ్రాస్ సాధించింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడం, సినిమాకు పబ్లిక్ టాక్ సానుకూలంగా ఉండటంతో వీకెండ్ ముగిసేసరికి ఈ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

సంయుక్త నిర్మాణం

రాజ్ అండ్ డీకే ఫేమ్ రాజ్ నిడిమోరు కథ అందించిన మా ఇంటి బంగారం చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్, హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్వర్ణ (సమంత) అనే ఒక సాధారణ గృహిణి కథను చూపించారు.

పెళ్లయిన తర్వాత భర్త అనిరుధ్ (దిగంత్ మంచాలె) తల్లిదండ్రులను కలవడానికి వెళ్లిన స్వర్ణకు వంటలు, ఇంటి పనులు అస్సలు రావు. అయినప్పటికీ అత్తమామలను ఎలాగోలా మెప్పించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, ఆమె గతానికి సంబంధించిన భయంకరమైన విలన్ కరుణ (గుల్షన్ దేవయ్య) మళ్లీ జీవితంలోకి ప్రవేశిస్తాడు.

యాక్షన్ అవతారంలో మెప్పించిన స్వర్ణ

తన పాత హింసాత్మక గతం ప్రస్తుత కుటుంబానికి తెలియకుండా, ఆ శత్రువుల నుంచి తన సంసారాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ చేసిన పోరాటమే ఈ సినిమా పరమార్థం. ఇందులో సమంత నటనకు, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లో ఆమె చూపించిన రౌద్ర రూపానికి ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe