Tax Free: అనుష్క శెట్టి రుద్రమదేవి నుంచి బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి వరకు- ట్యాక్స్ ఫ్రీ పొందిన తెలుగు సినిమాలు ఇవే!
Tax Free Telugu Movies Rudramadevi To Gautamiputra Satakarni: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇస్తుంటుంది. టాలీవుడ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలు, వాటి వెనుక ఉన్న ప్రత్యేక కారణాలపై ఇక్కడ ఓ లుక్కేద్దాం.
Tax Free Telugu Movies Rudramadevi To Gautamiputra Satakarni: తెలుగు సినిమా ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, ప్రపంచ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే, కేవలం కలెక్షన్లే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వచ్చే కొన్ని చిత్రాలను ప్రభుత్వాలు ప్రత్యేకంగా గుర్తిస్తాయి.

తక్కువ ధరకే టికెట్లు
అటువంటి సినిమాలకు వినోద పన్ను (Entertainment Tax) మినహాయింపు ఇస్తుంటాయి. దీనివల్ల సామాన్య ప్రేక్షకుడికి తక్కువ ధరకే టికెట్లు లభించి, సినిమా మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది.
ట్యాక్స్ ఫ్రీ తెలుగు సినిమాలు
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం 'కృష్ణావతారం పార్ట్ 1: హృదయం' అనే సినిమాకు ట్యాక్స్ ఫ్రీ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే, కృష్ణావతారం తరహాలో ట్యాక్స్ ఫ్రీ పొందిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
కాకతీయుల వైభవం.. 'రుద్రమదేవి'
2015లో వచ్చిన అనుష్క శెట్టి నటించిన 'రుద్రమదేవి' చిత్రం అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. కాకతీయ సామ్రాజ్య వీరనారి రుద్రమదేవి చరిత్రను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరుకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఫిదా అయ్యాయి. మన సంస్కృతిని, చరిత్రను చాటిచెప్పిన ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లోనూ వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు.
పాన్-ఇండియా రికార్డులు.. 'బాహుబలి 2'
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఎపిక్ వండర్ 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (2017). రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. భారతీయ సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు, దీని చారిత్రక ప్రాధాన్యతను గుర్తిస్తూ దేశంలోని పలు రాష్ట్రాలు ఈ సినిమాకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపులు ఇచ్చి గౌరవించాయి.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు అండ.. 'కేరాఫ్ కంచరపాలెం'
కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం కథనే నమ్ముకుని తీసిన అద్భుత చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం' (2018). అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న ఈ చిన్న సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని వినూత్న కథలు వస్తాయని పరిశ్రమ వర్గాలు భావించాయి.
శాతవాహనుల కథ.. 'గౌతమీపుత్ర శాతకర్ణి'
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' (2017) కూడా ఈ జాబితాలో నిలిచింది. తెలుగు రాజుల శౌర్యాన్ని, శాతవాహన సామ్రాజ్య వైభవాన్ని దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో కళ్లకు కట్టారు. తెలుగువారి మూలాలను గుర్తుచేసినందుకు గాను అప్పటి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ చిత్రానికి వంద శాతం పన్ను మినహాయింపు ప్రకటించాయి.
అరుదైన గౌరవంగా
వినోద పన్ను మినహాయింపు అనేది కేవలం ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ మాత్రమే కాదు, అది ఒక కళాఖండానికి దక్కే అరుదైన గౌరవం. సినిమా ద్వారా చరిత్రను, సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నానికి లభించే అతిపెద్ద ప్రోత్సాహకం అని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


