...
...
Next Story

ఫుట్‌బాల్ లెజెండ్ బెక‌హ‌మ్‌తో సమంత‌-ప్రేమ‌తో హ‌గ్‌-వీడియోలు వైర‌ల్‌

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి సమంత రూత్ ప్రభు, ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెకహమ్ కలిసి కనిపించారు. వారిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వీరిని చూసి తెగ మురిసిపోతున్నారు.

Published on: Nov 28, 2025, 20:35:56 IST
Advertisement

ఐక్యరాజ్యసమితి బాలల నిధి (UNICEF) గుడ్ విల్ అంబాసిడర్‌గా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ డేవిడ్ బెకహమ్, నటి సమంత రూత్ ప్రభుతో ముంబైలో ఓ కార్యక్రమంలో కనిపించారు. వారిద్దరూ కలిసి ఓ ఈవెంట్ నుండి బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరినీ చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

స్వీట్ హగ్

డేవిడ్ బెకహమ్, సమంత
డేవిడ్ బెకహమ్, సమంత

ఈవెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడు డేవిడ్, సమంతలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. కారు ఎక్కే ముందు వీరిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. డేవిడ్ సింపుల్‌గా బ్లాక్ టీ-షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లో కనిపించగా, సమంత గ్రే పిన్‌స్ట్రైప్ సూట్‌లో స్టైలిష్‌గా ఉంది. కారు ఎక్కే ముందు డేవిడ్ అభిమానులతో సెల్ఫీలు దిగి, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చారు.

ఫ్యాన్స్ రియాక్షన్

డేవిడ్, సమంత కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. ఒక అభిమాని "బెకహమ్ అదృష్టవంతుడు, ఆమె చాలా అందంగా ఉంది" అని కామెంట్ చేయగా, మరొకరు "ఇద్దరి దుస్తులు చాలా బాగున్నాయి" అని అన్నారు. ఇంకొకరు "వారిద్దరూ చాలా క్లాసీగా ఉన్నారు" అని ప్రశంసించారు. ఒక అభిమాని డేవిడ్ వినయాన్ని కూడా ప్రశంసిస్తూ, "అతను చాలా సాదాసీదాగా ఉంటాడు" అని రాశారు.

డేవిడ్ బెకహమ్ కామెంట్లు

శుక్రవారం (నవంబర్ 28) డేవిడ్ బెకహమ్ తన భారత పర్యటనలో భాగంగా 'ఎల్లె ఇండియా' కోసం సమంత రూత్ ప్రభుతో కలిసి ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్లాట్‌ఫామ్ షేర్ చేసిన వీడియోలో డేవిడ్ ఇండియా గురించి గొప్పగా చెప్పాడు.

సమంత రాబోయే ప్రాజెక్టులు

సమంత తన ప్రొడక్షన్ బ్యానర్‌పై ఇటీవల 'శుభం' సినిమాను నిర్మించింది. ఆమె తదుపరి 'రాజ్ అండ్ డీకే' వారి ‘రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్’లో కనిపించనుంది. ఈ షోలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, జైదీప్ అహ్లావత్, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks