Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి మనందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడిన సమంత.. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన అనారోగ్యం, విపరీతంగా బరువు తగ్గడంపై వస్తున్న ట్రోల్స్, అలాగే తన పెంపుడు పిల్లి 'జెలాటో' పేరు వెనుక ఉన్న కన్నీటి కథను పంచుకుంది.
బరువు తగ్గడంపై సమంత ఘాటు సమాధానం
గత కొన్ని రోజులుగా సమంత లుక్స్, ఆమె వెయిట్ లాస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై సమంత గలటా ప్లస్ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా మాట్లాడింది. మయోసైటిస్ వల్ల తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందని, ఏది పడితే అది తింటే రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపేదని తెలిపింది.
"చాలామంది నన్ను ఎప్పుడూ ఒకటే అడుగుతుంటారు.. ఎందుకు అంతలా బరువు తగ్గిపోయావని? అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. నేను తినలేకపోయాను" అంటూ తన బాధను వ్యక్తపరిచింది. ప్రస్తుతం తాను కొంచెం కోలుకున్నానని, ఇప్పుడు బాగానే తినగలుగుతున్నానని కానీ అతిగా ఏదీ తీసుకోలేనని స్పష్టం చేసింది.
ఆ పిల్లి పేరు 'జెలాటో' వెనుక ఉన్న కథ ఏంటంటే?
తన పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీని సమంత రివీల్ చేసింది. "నేను అనారోగ్యం వల్ల సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఏ చిన్న ఫుడ్ తిన్నా నా పొట్ట అప్సెట్ అయి మయోసైటిస్ వ్యాధి మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన చప్పటి ఆహారాన్ని తిన్నాను. ఆ నరకం చూశాక.. నా డైట్లో యాడ్ చేసుకోవడానికి డాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. షుగర్, డెయిరీ లేని జెలాటో ఐస్‌క్రీమ్. ఆ సమయంలో నేను దాని కోసమే ఎంతగానో ఎదురుచూసేదాన్ని. అందుకే నా లైఫ్‌లో అంత ప్రాధాన్యత ఉన్న ఆ పేరును నా పిల్లికి పెట్టుకున్నాను" అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత హెల్త్, కెరీర్ టైమ్‌లైన్
{{/usCountry}}తన పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీని సమంత రివీల్ చేసింది. "నేను అనారోగ్యం వల్ల సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఏ చిన్న ఫుడ్ తిన్నా నా పొట్ట అప్సెట్ అయి మయోసైటిస్ వ్యాధి మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన చప్పటి ఆహారాన్ని తిన్నాను. ఆ నరకం చూశాక.. నా డైట్లో యాడ్ చేసుకోవడానికి డాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. షుగర్, డెయిరీ లేని జెలాటో ఐస్‌క్రీమ్. ఆ సమయంలో నేను దాని కోసమే ఎంతగానో ఎదురుచూసేదాన్ని. అందుకే నా లైఫ్‌లో అంత ప్రాధాన్యత ఉన్న ఆ పేరును నా పిల్లికి పెట్టుకున్నాను" అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత హెల్త్, కెరీర్ టైమ్‌లైన్
{{/usCountry}}- 2021: నాగ చైతన్యతో విడాకులు
- 2022: 'యశోద' ప్రమోషన్స్ సమయంలో మయోసైటిస్ వ్యాధి గుర్తింపు
- 2023-2025: సినిమాలకు లాంగ్ బ్రేక్, ట్రీట్‌మెంట్
- 2026: 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్
ఇండస్ట్రీ వదిలేయాలి అనుకున్నా.. నన్ను మార్చిన బ్రేక్
మయోసైటిస్ గుర్తించిన తర్వాత తన ఆలోచనా విధానం ఎలా మారిందో సమంత మరో ఇంటర్వ్యూలో పంచుకుంది. "నేను కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో రాత్రింబవళ్లు కష్టపడి సినిమాలు చేయాలనే ఇగో ఉండేది. యాక్టర్‌గా మనకు ఎండ్ కార్డ్ అనేది ఉండదు అనుకుంటాం. కానీ ఈ బ్రేక్ సమయంలో నా కెరీర్ ముగింపును నేను ఊహించుకోగలిగాను. అది నన్ను చాలా మార్చింది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీకి వస్తే నా పాత పద్ధతులను, లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను" అని సమంత ఎమోషనల్ అయింది.
'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం
నందిని రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాలో సమంత హౌస్‌వైఫ్ పాత్రలో కనిపిస్తూనే పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేసి గాయపడినట్లు స్వయంగా వెల్లడించింది. ఈ చిత్రంలో గౌతమి, శ్రీముఖి, దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమంత స్వయంగా తన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను నిర్మించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రిలీజ్‌కు ముందే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా పూర్తి బడ్జెట్ పెట్టుబడిని రికవరీ చేసి ఇప్పటికే లాభాల్లోకి దూసుకెళ్లడం విశేషం. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమాతో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.