Samantha Pregnant: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు మరోసారి ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటేమో ఆమె మూవీ ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ కాగా.. మరొకటి సామ్ ప్రెగ్నెంట్ అనే వార్త. సమంత త్వరలోనే తల్లి కాబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
సమంత ప్రెగ్నెంట్

మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆమె త్వరలోనే తల్లి కాబోతుందనే వార్త నిజమేనని జాతీయ వార్త సంస్థ ఎన్డీటీవీ ప్రత్యేక కథనంలో ధృవీకరించింది. సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ పేర్కొంది.
బేబీ బంప్ వీడియో
సమంత, రాజ్ నిడిమోరు తమ మొదటి బిడ్డను స్వాగతించబోతున్నారనే వార్త బయటకు రావడంతో సామాజిక మాధ్యమాలలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్ ను శనివారం (జూన్ 20) నిర్వహించారు. ఈ ఈవెంట్లో కేక్ కటింగ్ కు వైట్ టీషర్ట్ లో వచ్చిన సమంత బేబీ బంప్ తో కనిపించింది. అంతే ఇక ఈ వీడియో వైరల్ గా మారింది.
భర్తతో కలిసి
మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత వైట్ ఫిట్టెడ్ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించగా, ఆమె పక్కనే రాజ్ నిడిమోరు షర్ట్, జీన్స్‌లో కనిపించారు. అయితే, డేగ కళ్లతో గమనించిన అభిమానులు ఆ వీడియోలో సమంత బేబీ బంప్‌ను స్పష్టంగా గుర్తించారు. దాంతో ఈ క్రేజీ అప్డేట్ క్షణాల్లోనే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత, రాజ్ నిడిమోరుల వివాహ బంధం
{{/usCountry}}మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత వైట్ ఫిట్టెడ్ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించగా, ఆమె పక్కనే రాజ్ నిడిమోరు షర్ట్, జీన్స్‌లో కనిపించారు. అయితే, డేగ కళ్లతో గమనించిన అభిమానులు ఆ వీడియోలో సమంత బేబీ బంప్‌ను స్పష్టంగా గుర్తించారు. దాంతో ఈ క్రేజీ అప్డేట్ క్షణాల్లోనే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత, రాజ్ నిడిమోరుల వివాహ బంధం
{{/usCountry}}సమంత, రాజ్ నిడిమోరుల వివాహం గతేడాది డిసెంబర్ 1వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. పెళ్లి జరిగిన రోజే సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో సమంత్, రాజ్ కు పరిచయం జరిగింది. ఆ సిరీస్‌లో సమంత పోషించిన రాజి పాత్రకు రాజ్ నిడిమోరు అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అందించాడు.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్‌లలో కనిపించడంతో వీరి ప్రేమాయణంపై మొదటిసారి రూమర్స్ వచ్చాయి. ఆ టోర్నమెంట్‌లో సొంత టీమ్ 'చెన్నై సూపర్ చాంప్స్' జట్టుకు మద్దతు ఇవ్వడానికి సమంత, రాజ్ పక్కపక్కనే కూర్చుని సందడి చేశారు. అప్పటి నుంచి వీళ్లు ఎక్కువగా కలిసే కనిపించారు. చివరకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
'మా ఇంటి బంగారం' గురించి..
శుక్రవారం (జూన్ 19) థియేటర్లలో విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 2019 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఓ బేబీ’ తర్వాత దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి సంయుక్తంగా స్క్రీన్‌ప్లే అందించారు. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించింది.