...
...
Next Story

Samantha Akhil: మాజీ మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన సమంత.. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయంటూ పోస్ట్

Samantha Akhil: అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఈరోజే (జులై 10, 2026) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. దీంతో అఖిల్ మాజీ వదిన, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఇన్‌స్టా స్టోరీ వైరల్ అయింది.

Published on: Jul 10, 2026, 13:42:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Samantha Akhil: స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన మాజీ మరిది అఖిల్ అక్కినేని కొత్త మూవీ ‘లెనిన్’ ట్రైలర్ షేర్ చేస్తూ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్యే మా ఇంటి బంగారం మూవీపై అఖిల్ ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు లెనిన్ రిలీజ్ రోజే అఖిల్ తోపాటు మొత్తం మూవీ టీమ్ కు సమంత బెస్ట్ విషెస్ చెప్పింది.

బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయట..

Samantha Akhil: మాజీ మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన సమంత.. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయంటూ పోస్ట్
Samantha Akhil: మాజీ మరిదికి ఆల్ ద బెస్ట్ చెప్పిన సమంత.. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయంటూ పోస్ట్

సమంత శుక్రవారం (జులై 10) ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో సమంత రాస్తూ.. “లెనిన్, అఖిల్ అక్కినేని, మొత్తం టీమ్ కు ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్ వచ్చేస్తున్నాయి” అంటూ స్ట్రాంగ్ మజిల్ ఎమోజీలను జోడించారు. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొడుతుందనే నమ్మకాన్ని సామ్ వ్యక్తం చేయడం విశేషం.

విడిపోయినా తగ్గని అక్కినేని బాండింగ్

నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంతకు అక్కినేని ఫ్యామిలీతో, ముఖ్యంగా అఖిల్‌తో ఉన్న మ్యూచువల్ బాండింగ్ అలాగే ఉందనడానికి ఈ పోస్ట్ ఒక నిదర్శనం. గతంలోనూ అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా సమయంలోనూ సమంత ఇలాగే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు.

ఇప్పుడు అఖిల్ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన ‘లెనిన్’ సినిమా రిలీజ్ రోజునే సామ్ ఈ విధంగా ఓపెన్‌గా విష్ చేయడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సమంత చూపించిన ఈ పెద్ద మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సమంత యాక్షన్ పవర్‌పై అఖిల్ ప్రశంసలు

"సినిమా టీమ్ అందరికి కంగ్రాట్స్. నాకు వైబ్ చాలా నచ్చింది. రూటెడ్ మాత్రమే కాకుండా సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ ఇంట్లో, మా ఇంటి బంగారం అని పేరు పెట్టుకుని అలాంటి యాక్షన్ తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అందులోనూ ముఖ్యంగా ఫీమేల్ పాత్రతో ఆ లెవెల్ యాక్షన్ చేయడం మాములు విషయం కాదు. నిజంగా సామ్‌ది అద్భుతమైన జాబ్. సినిమా వైబ్ బాగా వర్కౌట్ అయింది" అని అఖిల్ అనడం విశేషం.

సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

‘లెనిన్’ మూవీ ప్రత్యేకతలు ఏంటంటే?

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ రూరల్ యాక్షన్ లవ్ స్టోరీ. ‘ఏజెంట్’ (2023) తర్వాత అఖిల్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అఖిల్ అక్కినేని సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, సునీల్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

టాక్ ఎలా ఉందంటే.. బ్లాక్‌బస్టర్ వైబ్స్ నిజమేనా?

థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా సెకండాఫ్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు, అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మహాభారతం లైన్స్‌లో సాగే ఈ పీరియాడిక్ అండ్ రూరల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ నటన కెరీర్ బెస్ట్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జోస్యం చెప్పినట్లుగానే థియేటర్లలో ‘బ్లాక్‌బస్టర్ వైబ్స్’ స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks