సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి తర్వాత తన భర్త రాజ్ నిడిమోరు ఇంట్లో తొలి ఉగాదిని జరుపుకుంటోంది. అయితే ఈ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్లు కూడా నిర్వహిస్తూ.. ఉగాది పండగనాడు తాను పచ్చడి చేసే వీడియోను షేర్ చేసింది. దీనిని తయారు చేయడంలో యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డి ఆమెకు సాయం చేయడం ఇందులో చూడొచ్చు.
సమంత ఉగాది పచ్చడి

సమంత ఈ వీడియో మొదట్లోనే ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంది. మా ఇంటి బంగారం మూవీ డైరెక్టర్ నందిని రెడ్డిని పిలుస్తుంది. ఆమెకు కూడా అది తెలియకపోవడంతో యాంకర్ సుమకు ఫోన్ చేస్తుంది. ఆమె తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చి.. చకాచకా ఆ ఇద్దరి చేత ఉగాది పచ్చడి చేయిస్తుంది. పనిలోపనిగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లు కూడా చేసేశారు.
రాజ్‌ను బాబు అని పిలుస్తూ..
ఉగాది పచ్చడి చేయడం పూర్తయ్యాక సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేస్తుంది. హాయ్ బాబు అంటూ ఆమె పిలవడం చూసి పక్కనే ఉన్న సుమ షాక్ తింటుంది. తాను ఉగాది పచ్చడి చేశానని సామ్ చెప్పడంతో నువ్వు చేశావా అని రాజ్ అడుగుతాడు. అది విని సుమ, నందిని పగలబడి నవ్వుతారు. ఆ తర్వాత సమంత ఉగాది పచ్చడిని అందరూ టేస్ట్ చేస్తారు. ఉగాది పచ్చడి చేయడం ఎలా అంటూ ఈ వీడియోను సమంత ప్రొడక్షన్ హౌజ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ షేర్ చేసింది.
మా ఇంటి బంగారం రిలీజ్ డేట్
కొంత కాలం గ్యాప్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా రిలీజ్ డేట్ ను గతంలోనే అనౌన్స్ చేశారు. వేసవి కానుకంగా ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు.
{{/usCountry}}కొంత కాలం గ్యాప్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా రిలీజ్ డేట్ ను గతంలోనే అనౌన్స్ చేశారు. వేసవి కానుకంగా ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు.
{{/usCountry}}సమంత హీరోయిన్ గా నటించడమే కాకుండా మా ఇంటి బంగారం మూవీకి ఆమెనే నిర్మాత కూడా. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందంచాడు. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఇప్పటికే మా ఇంటి బంగారం మూవీ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ మూవీలో సమంత రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది.
ఓ వైపు ఇంట్లో కోడలిగా పద్ధతిగా ఉండే సామ్.. బయట యాక్షన్ తో గూండాల పని పడుతుంది. అమాయకంగా నటిస్తూనే ఫైటింగ్ సీన్స్ లో యాక్షన్ మోడ్ లోకి సమంత వెళ్లిపోయింది. మా ఇంటి బంగారం మూవీ సమంతకు మంచి కమ్ బ్యాక్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.