సమంతకు అతడే పర్ఫెక్ట్.. ఆమె మనసును అర్థం చేసుకున్నవాడు: సామ్ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్
సమంతకు రాజ్ నిడిమోరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఆమె బెస్ట్ ఫ్రెండ్ చెప్పడం విశేషం. ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రెండు రోజుల కిందట అంటే డిసెంబర్ 1న సమంత, రాజ్ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో 'యోగ' పద్ధతిలో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ కూడా హాజరైంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన క్రేషా.. సమంతకు రాజ్ ఎందుకు సరైన జోడి అనేది అందంగా వివరించింది.

సమంత మనసు తెలిసిన వాడు రాజ్
డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన డిజైనర్ క్రేషా బజాజ్.. రాజ్ సమంతకు ఎందుకు సరైనోడో వివరిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సమంత మనసుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి రాజ్ అని ఆమె పేర్కొంది.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ క్రేషా బజాజ్ ఇలా రాసుకొచ్చింది. "చిన్న చిన్న ఆనందాలే నన్ను ముందుకు నడిపిస్తాయి. కానీ గత రెండు రోజులుగా నేను అనుభవించిన అనుభూతి వేరు. అందరూ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ మనతోనే ఉండిపోతుంది" అని చెప్పింది.
ఇక రాజ్ నిడిమోరు.. సమంతకు ఎందుకు పర్ఫెక్ట్ అనేది వివరిస్తూ ఆమె ఇలా చెప్పింది. "నా బెస్ట్ ఫ్రెండ్, నా సోదరి... తన మనసుకు సరిగ్గా సరిపోయే వ్యక్తితో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇది మనసును తాకే విషయం. ఇది నన్ను ఆగిపోయేలా చేసింది. అన్ని భావోద్వేగాలను ఒక్కసారిగా ఫీల్ అయ్యేలా చేసింది" అని రాసింది.
కేవలం సమంత జీవితంలోకే కాదు.. రాజ్ తమ అందరి జీవితాల్లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని క్రేషా చెప్పింది. ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "నా మనసు నిండిపోయింది" అంటూ వైట్ హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేసింది.
సమంత - క్రేషా బజాజ్ అనుబంధం
సమంత, క్రేషా బజాజ్ మధ్య కొన్నేళ్లుగా గాఢమైన స్నేహం ఉంది. నాగ చైతన్యతో 2017లో జరిగిన పెళ్లికి సమంత ధరించిన చీర, గౌనును డిజైన్ చేసింది క్రేషా బజాజే. 2021లో చైతన్యతో విడిపోయిన తర్వాత 2024లో సమంత తన పాత వెడ్డింగ్ గౌనును నలుపు రంగులోకి మార్పించుకుంది. ఆ పని చేసింది కూడా క్రేషానే.
సమంత జీవితంలోని ఎత్తుపల్లాల్లో క్రేషా ఎప్పుడూ ఆమెకు అండగా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు రాజ్ నిడిమోరు రాకతో తన స్నేహితురాలు సంతోషంగా ఉండటం చూసి ఆమె ఉప్పొంగిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


