Sambhavam Adhyayam Onnu Review: మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా విడుదలైన 'సంభవం అధ్యాయం ఒన్ను' (Sambhavam Adhyayam Onnu) అనే టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను మన నేటివిటీకి తగ్గట్టుగా మలచడంలో దర్శకుడు ఎంతవరకు విజయం సాధించారో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
టైమ్ లూప్ థ్రిల్లర్.. ఒకే అడవి.. 30 ఏళ్ల కథ
ఒక పోలీసు అధికారి దట్టమైన అడవి ప్రాంతంలోకి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాడు. అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉంటారు. అయితే ఆ అడవిలో వారికి వాకీ-టాకీ ద్వారా ఒక వ్యక్తి వాయిస్ వినిపిస్తుంది. తీరా ఆరా తీస్తే అతను కూడా ఒక పోలీసు అధికారి అని, ప్రస్తుతానికి 30 ఏళ్ల క్రితం (అదే తేదీన) అదే అడవిలో ఉన్నాడని తెలుస్తుంది.
అంటే 1994లో ఉన్న వ్యక్తితో 2024లో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారన్నమాట. ఈ విచిత్రమైన పరిస్థితి నుండి వారు ఎలా బయటపడ్డారు? ఆ అడవిలో ఉన్న రహస్యం ఏంటి? అసలు ఆ వాకీటాకీలో 30 ఏళ్ల కిందట ఉన్న వ్యక్తి వీళ్లతో ఎలా మాట్లాడాడు? ఆ టైమ్ లూప్ నుంచి అతడు బయటపడ్డాడా లేదా అనేదే ఈ సినిమా కథ.
స్క్రీన్ ప్లే హైలైట్: ఎడ్జ్ ఆఫ్ టుమారో తరహాలో..
హాలీవుడ్ చిత్రాలైన 'ఎడ్జ్ ఆఫ్ టుమారో', 'టెనెట్' వంటి సినిమాలను చూసిన వారికి టైమ్ లూప్ కాన్సెప్ట్ సుపరిచితమే. అయితే ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీ దర్శకుడు జీతూ సతీశన్ మంగళత్ ఈ కథను మలయాళ నేటివిటీకి, మన పురాణ గాథల (Mythology) ఛాయలకు దగ్గరగా తీర్చిదిద్దారు. రక్తం చిందితే ఓ టైమ్ లూప్ లోనే ఇరుక్కుపోవడం అనే ఓ భిన్నమైన స్టోరీని ఇందులో చూడొచ్చు.
{{/usCountry}}హాలీవుడ్ చిత్రాలైన 'ఎడ్జ్ ఆఫ్ టుమారో', 'టెనెట్' వంటి సినిమాలను చూసిన వారికి టైమ్ లూప్ కాన్సెప్ట్ సుపరిచితమే. అయితే ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీ దర్శకుడు జీతూ సతీశన్ మంగళత్ ఈ కథను మలయాళ నేటివిటీకి, మన పురాణ గాథల (Mythology) ఛాయలకు దగ్గరగా తీర్చిదిద్దారు. రక్తం చిందితే ఓ టైమ్ లూప్ లోనే ఇరుక్కుపోవడం అనే ఓ భిన్నమైన స్టోరీని ఇందులో చూడొచ్చు.
{{/usCountry}}రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, టైమ్ లైన్‌ల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఒక దశలో అసలు ఏం జరుగుతుందో చూసే ప్రేక్షకులకు అంతుబట్టదు. మూవీ చూస్తూ మన మెదడుకు కూడా పని చెప్పాల్సిందే.
నటీనటుల ప్రతిభ - సాంకేతికత
ప్రముఖ మలయాళం నటుడు ఆసిఫ్ అలీ సోదరుడు, నటుడు అస్కర్ అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఒదిగిపోయారు. సిద్ధార్థ్ భరతన్, వినీత్ కుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అడవి నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, సినిమాటోగ్రఫీ కీలకంగా మారింది.
అడవిలోని భయానక వాతావరణాన్ని కెమెరామెన్ చక్కగా బంధించారు. తక్కువ బడ్జెట్‌లో ఇంతటి సంక్లిష్టమైన కథను స్పష్టంగా ఎడిట్ చేయడం ప్రశంసనీయం. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
తండ్రిని కాపాడి.. కూతురిని కోల్పోయి..
మలయాళంలో థ్రిల్లర్ సినిమాలు సహజమే. కానీ ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు రావడం అరుదు. పరిమిత వనరులతో ఒక అంతర్జాతీయ స్థాయి కాన్సెప్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు.
కథలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లు అనిపించినా, ఓవరాల్‌గా ఒక కొత్త తరహా అనుభూతిని ఇవ్వడంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ టైమ్ లూప్ లో తండ్రిని కాపాడుకోవడంలో సక్సెస్ అయిన హీరో.. తన సొంత కూతురిని మాత్రం కోల్పోయాడా అనే సస్పెన్స్ లో మూవీని ముగించిన తీరు కూడా బాగుంది.
దీనికి సీక్వెల్ కూడా రాబోతుందని ఆ క్లైమ్యాక్స్ చూస్తే స్పష్టమవుతోంది. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.3 రేటింగ్ ఉంది. టైమ్ లూప్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీ మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'సంభవం అధ్యాయం ఒన్ను' ఏ జోనర్‌కు చెందిన సినిమా?
ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ టైమ్ లూప్ థ్రిల్లర్. సైన్స్ ఫిక్షన్, మిస్టరీ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
2. సంభవం అధ్యాయం ఒన్ను సినిమా కథాంశం ఏమిటి?
వేర్వేరు కాలమానాల్లో (టైమ్ లైన్స్) ఉన్న పోలీసులు ఒకే అడవిలో చిక్కుకుపోవడం, వారు ఎదుర్కొన్న వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
3. సంభవం అధ్యాయం ఒన్ను సినిమా హిట్టా లేదా ఫ్లాపా?
'టెనెట్' లేదా 'లూపర్' వంటి మైండ్ బెండింగ్ సినిమాలు ఇష్టపడే వారికి, అలాగే కొత్త తరహా మలయాళ థ్రిల్లర్లను ఆదరించే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మూవీకి ఐఎండీబీలోనూ 7.3 రేటింగ్ నమోదవడం చూస్తుంటే ప్రేక్షకులకు బాగా నచ్చినట్లే.