సిన్సియర్ ఉద్యోగి-డబ్బు పిచ్చి పెళ్లాం-రౌడీ కొడుకు-ఓటీటీలోకి డైరెక్ట్‌గా క్రైమ్ థ్రిల్లర్-ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ నేరుగా వచ్చేస్తోంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఇవాళ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.
తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ (ఫిబ్రవరి 7) రిలీజ్ చేశారు. చీఫ్ గెస్ట్ గా అనిల్ రావిపూడి అటెండ్ అయ్యి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ
తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది ఫిబ్రవరి 12న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ డైరెక్టర్. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై శివాజీ సొంటినేని నిర్మించారు. ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో శివాజీ, లయ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, చంద్ర, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు నటిస్తున్నారు.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో సిన్సియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ గా శివాజీ నటించారు. పనిలో ఎంతో నిజాయతీతో ఉంటాడు. దొంగ సంతకాలు అస్సలు చేయడు. కానీ అతని భార్య ఉత్తర (లయ)కు మనీ మీద ఆశ ఎక్కువ. భర్తను లంచం తీసుకోమ్మని బలవంతం చేస్తుంటుంది.
రౌడీ కొడుకు
శ్రీరామ్, ఉత్తరకు ఓ రౌడీ కొడుకు ఉంటాడు. ఊర్లో గొడవలు చేస్తుంటాడు. తన అల్లరితో తండ్రికి తలనొప్పి తెప్పిస్తుంటాడు. ఇలా వీళ్ల లైఫ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే అంటూ వచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ‘వాడు నువ్వు అనుకున్నంత సుద్దపూస ఏం కాదు’ అని ఇమ్మాన్యుయేల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మలుపు తీసుకుంటుంది.
హత్య కేసు
శ్రీరామ్ ఫ్యామిలీ కలిసి ఎవరినో హత్య చేసినట్లు చూపించారు. ఈ శవాన్ని మాయం చేయడానికి వీళ్లు నానా తంటాలు పడతారు. ఇవన్నీ ఫన్నీగా ఉన్నాయి. ఇక అలీ, ధన్ రాజ్, ఇమ్మాన్యుయేల్, చంద్రతో కామెడీ పండినట్లే కనిపిస్తోంది. ‘ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది’ అని అలీ డైలాగ్ ఉంటుంది.
హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అఫీసర్ గా ప్రిన్స్ నటించాడు. తర్వాత కథ అంతా హత్య ఇన్వెస్టిగేషన్, అందులో శ్రీరామ్ పాత్ర గురించే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓటీటీ ఆడియన్స్ కోసం ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


