శుక్రవారం వచ్చేసింది. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలో కొత్త సందడి కూడా వచ్చేసింది. ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. రీసెంట్ గా థియేటర్లలో నవ్వులతో పాటు సస్పెన్స్, థ్రిల్ అందించిన ఆ సినిమానే ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ మూవీ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ

తెలుగు లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఇవాళ (ఏప్రిల్ 3) ఓటీటీలోకి వచ్చేసింది. చాలా ఏళ్ల తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ తెలుగు మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లో ఇలా
థియేటర్ లో రిలీజ్ చేద్దామా లేదా ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేద్దామా? అనే కన్య్ఫూజన్ ను దాటి థియేటర్లలో విడుదలైన మూవీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మార్చి 6, 2026న ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ స్క్రీన్ పైకి వచ్చేసింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వినిపించింది.
ఈటీవీ విన్ లో అనుకుంటే
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాకు ఇందులో హీరోగా చేసిన శివాజీనే ప్రొడ్యూసర్. ఫస్ట్ నుంచి ఇది ఈటీవీ విన్ మూవీగానే జర్నీ స్టార్ట్ చేసింది. దీంతో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శివాజీ, లయతో పాటు రోహన్, శరత్ లోహితాశ్వ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, ఇమ్యాన్యుయేల్ తదితరులు నటించారు.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని స్టోరీ
ఓ ఫ్యామిలీ, ఓ శవం, దాన్ని మాయం చేయాలనుకోవడం.. ఈ కథాంశం చుట్టూ సాగే సినిమానే సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ సెక్రెటరీగా పని చేస్తుంటాడు. అతని నిజాయతీపరుడు. లంచం తీసుకోడు. అతని భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్).
{{/usCountry}}ఓ ఫ్యామిలీ, ఓ శవం, దాన్ని మాయం చేయాలనుకోవడం.. ఈ కథాంశం చుట్టూ సాగే సినిమానే సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ సెక్రెటరీగా పని చేస్తుంటాడు. అతని నిజాయతీపరుడు. లంచం తీసుకోడు. అతని భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్).
{{/usCountry}}శ్రీరామ్ తో ఓ సారి ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్)కు గొడవ జరుగుతుంది. దీంతో శ్రీరామ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరపై ప్రిన్స్ అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే వాసుదేవ్ ను బిట్టు చంపేస్తాడు. ఈ శవాన్ని మాయం చేసేందుకు ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు సినిమాను మరో లెవల్ తీసుకెళ్లాయి.