న్యూ ఇయ‌ర్‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా- స్పిరిట్ నుంచి సర్‌ప్రైజ్‌- యానిమ‌ల్ సెంటిమెంట్!

న్యూ ఇయర్ రోజున ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. యానిమల్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న ఈ దర్శకుడు పెద్ద అప్ డేట్ ఇవ్వబోతున్నాడని టాక్. 

Published on: Dec 30, 2025, 08:37:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజా సాబ్ అంటూ ఈ సంక్రాంతికి థియేటర్లకు వస్తున్నాడు ప్రభాస్. అయితే అంతకంటే ముందే డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ రోజున బిగ్ అప్ డేబ్ రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ బజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ప్రభాస్ (x/rajasaabmovie)
ప్రభాస్ (x/rajasaabmovie)

స్పిరిట్ ఫస్ట్ లుక్

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ స్పిరిట్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ గా కనిపించబోతున్నాడు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 2026 న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేసే అవకాశముంది. సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

యానిమల్ సెంటిమెంట్

జనవరి 1న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సందీప్ రెడ్డి వంగాకు బాగా కలిసొచ్చేదే. ఎందుకంటే రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ ఫస్ట్ లుక్ కూడా న్యూ ఇయర్ రోజు నైట్ రిలీజ్ చేశాడు ఈ డైరెక్టర్. ఆ మూవీ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ జనవరి 1న రాత్రి స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయబోతున్నాడని సమాచారం.

ఆడియో స్టోరీ

ఇప్పటికే స్పిరిట్ నుంచి వచ్చిన ఆడియో స్టోరీ అప్ డేట్ తెగ వైరల్ గా మారింది. ఆ వాయిస్ ప్రోమోతో స్పిరిట్ స్టోరీ చెప్పేశాడు సందీప్. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. ఫస్ట్ లుక్ తో పాటు స్పిరిట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారనే బజ్ వినిపిస్తోంది.

రాజా సాబ్ తో

రాజా సాబ్ అంటూ ప్రభాస్ రచ్చ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రభాస్ నటిస్తున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేసిన రాజా సాబ్ 2.0 ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు. దీనికి మారుతి డైరెక్టర్. సంక్రాంతి రేసులో ఫస్ట్ రిలీజ్ కాబోతున్న మూవీ రాజా సాబ్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More