Sandeep Reddy Vanga: సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు హిస్టరీ క్రియేట్ చేస్తాయి. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ఫ్యూచర్లో చూసే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవితో మూవీ తీస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పడం సంచలనంగా మారింది. ఈ వీడియో మాములూగా వైరల్ కావడం లేదు.
మెగాస్టార్ జోరు

సుదీర్ఘ కెరీర్, ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎంతో మందికి స్ఫూర్తి.. ఇదీ చిరంజీవి ఘన ప్రస్థానం. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీపడుతూ మెగాస్టార్ సినిమాలు తీస్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు.
చిరంజీవితో సినిమా
మరోవైపు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎంత బోల్డ్ గా, ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ను షేక్ చేశాడు సందీప్. తాజాగా చిరంజీవితో సినిమా తీయాలని ఉందని అతను పేర్కొన్నాడు.
ఫేవరేట్ నటుడు
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ న్యూస్ రిపోర్టర్ వచ్చి సందీప్ ను ఓ ప్రశ్న అడుగుతుంది. ‘‘నెక్ట్స్ ఏంటీ? మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు? ఫ్యూచర్ లో దర్శకత్వం వహించాలని అనుకునే యాక్టర్ ఎవరు’’ అని సందీప్ ను అడుగుతుంది. ‘‘చిరంజీవి’’ అని సందీప్ ఆన్సర్ చెప్తాడు. దీన్ని బట్టి చిరంజీవి- సందీప్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు.
స్పిరిట్ తో
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.
కొత్త మూవీ
{{/usCountry}}ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.
కొత్త మూవీ
{{/usCountry}}ఇక మెగాస్టార్ జోరుమీదున్నారు. మన శంకర వర ప్రసాద్ గారుతో తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఇదే జోష్ లో సినిమాలు చేస్తున్నారు. తాజాగా బాబీ కొల్లి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో చిరు నటిస్తున్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమం తాజాగా జరిగింది. మరోవైపు చిరు మూవీ విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతోంది.