కొన్నేళ్ల క్రితం షూటింగ్ మొదలెట్టుకున్న వివిధ కారణాల వల్ల ఆలస్యమైన సినిమాలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. కరోనా టైమ్ లో అప్పటి పరిస్థితుల్లో లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ‘సంధ్యానామ ఉపాసతే’ మూవీ పరిస్థితి కూడా అలాంటిదే. 2022లో షూటింగ్ మొదలెట్టుకున్న మూవీ ఇన్నేళ్లకు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
సంధ్యానామ ఉపాసతే ఓటీటీ

తెలుగులో వచ్చిన లవ్ ఎమోషనల్ డ్రామా సంధ్యానామ ఉపాసతే. ఈ చిత్రం ఇవాళ (జనవరి 22) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మనసుకు హత్తుకునే సీన్లతో సాగుతోంది ఈ మూవీ. కరోనా టైమ్ లోని పరిస్థితులను కళ్లకు కట్టింది సంధ్యానామ ఉపాసతే సినిమా.
అసలు మతమే లేని ఒక దేశం విసిరిన కరోనా బాంబ్ ఇన్ని మతాలు, మందిరాలు ఉన్న దేశం మీద పడి అల్లకల్లోలం అవుతుంటే అందులో ఉన్న దేవుళ్లు ఏం చేస్తున్నారు సార్, దేవుళ్లు పారిపోయారా? అనే సినిమాలోని డైలాగ్ ఆకట్టుకుంటోంది.
నేరుగా ఓటీటీలోకి
కరోనా అందరి జీవితాలను ఏదో రకంగా ప్రభావితం చేసింది. వైరస్ సోకుతుందేమోనన్న భయం, కరోనా వస్తే చనిపోతామేమోననే ఆందోళన.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో భయపడ్డవాళ్లే. అప్పటి క్వారంటైన్, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ సంధ్యానామ ఉపాసతే. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్నా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీంతో థియేటర్లలోకి కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.
సంధ్యానామ ఉపాసతే సినిమాలో వంశీ, క్రిస్టెన్ రవళి ప్రధాన పాత్రలు పోషించారు. దీప్తి వర్మ, పోసాని, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్టర్ ప్రొమో భాస్కర్. ఈ సినిమాను సుబ్రహ్మణ్యం రాజు, చంద్రశేఖర్ ప్రసాద్, వీర వెంకట సత్య నారాయణ నిర్మించారు.
సంధ్యానామ ఉపాసతే స్టోరి
{{/usCountry}}సంధ్యానామ ఉపాసతే సినిమాలో వంశీ, క్రిస్టెన్ రవళి ప్రధాన పాత్రలు పోషించారు. దీప్తి వర్మ, పోసాని, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్టర్ ప్రొమో భాస్కర్. ఈ సినిమాను సుబ్రహ్మణ్యం రాజు, చంద్రశేఖర్ ప్రసాద్, వీర వెంకట సత్య నారాయణ నిర్మించారు.
సంధ్యానామ ఉపాసతే స్టోరి
{{/usCountry}}క్వారంటైన్, లాక్ డౌన్, వ్యాక్సిన్.. కరోనా కారణంగా ఈ పదాలు అందరికీ పరిచయమయ్యాయి. కరోనా సమయంలోని పరిస్థితుల మధ్య సాగే కథనే సంధ్యానామ ఉపాసతే. ఇప్పుడు ఇది ఔట్ డేటెడ్ స్టోరీనే. కానీ మరోసారి ఆ కరోనా టైమ్ లోని నొస్టాల్జియా మాత్రం కనెక్ట్ అవుతుంది.
ఉదయ్, సంధ్య క్వారంటైన్ రూమ్ లో కలుసుకుంటారు. వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. లాక్ డౌన్ లో నిర్మానుష్యమైన రోడ్ల మీద ఈ జోడీ బండి వేసుకుని చక్కర్లు కొడుతోంది. మరి వీళ్ల ప్రేమకు ఎలాంటి ముగింపు దక్కింది? కరోనా కారణంగా జనాల మానసిక ఆవేదన ఎలా ఉండేది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.