Sanjay Gupta: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్తా హఠాన్మరణం చెందారు. ఆయన ముంబైలోని తన నివాసంలో బాత్రూంలో ప్రమాదవశాత్తూ జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై మరణించినట్లు సమాచారం.
షాకింగ్ న్యూస్

సంజయ్ గుప్తా మరణం తాలూకు విషాద ఘటన ఇవాళ (అక్టోబర్ 31) ఉదయం వెలుగులోకి రావడంతో సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు.. దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా (Accidental Death) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలీసు విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గానీ, కుట్ర కోణం గానీ కనిపించలేదని స్పష్టమైంది.
బాలీవుడ్ లో తీవ్ర విషాదం
సంజయ్ గుప్తా హఠాన్మరణం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణవార్తను ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఆయన ప్రాణ స్నేహితుడు అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించారు.
"ఇది చాలా షాకింగ్, అత్యంత బాధాకరమైన విషయం. నా ఆప్త మిత్రుడు, గొప్ప దర్శకుడు సంజయ్ గుప్తా ఇక లేరు అన్న వార్త ఇప్పుడే తెలిసింది. ఇంట్లో తలకు గాయం కావడం వల్లే ఆయన మరణించారు. ఒక అద్భుతమైన స్టోరీ టెల్లర్, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మంచి మనిషిని ఇండస్ట్రీ కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అంటూ అశోక్ పండిట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అలాగే హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ సైతం ఈ వార్త విని షాక్ కు గురయ్యామని తెలుపుతూ నివాళులు అర్పించారు. రచయిత మిలాప్ జవేరి స్పందిస్తూ.. "ఇది చాలా విషాదకరమైన వార్త, నేను వెంటనే ఆయన ఇంటికి బయలుదేరుతున్నాను" అని పేర్కొన్నారు.
బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
{{/usCountry}}అలాగే హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ సైతం ఈ వార్త విని షాక్ కు గురయ్యామని తెలుపుతూ నివాళులు అర్పించారు. రచయిత మిలాప్ జవేరి స్పందిస్తూ.. "ఇది చాలా విషాదకరమైన వార్త, నేను వెంటనే ఆయన ఇంటికి బయలుదేరుతున్నాను" అని పేర్కొన్నారు.
బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
{{/usCountry}}దర్శకుడిగానే కాకుండా మంచి నిర్మాతగా, అద్భుతమైన స్క్రీన్ రైటర్‌గా సంజయ్ గుప్తా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అండర్ వరల్డ్, క్రైమ్ థ్రిల్లర్ కథలను స్క్రీన్ మీద చాలా స్టైలిష్ గా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి.
1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి హీరోలుగా వచ్చిన 'ఆతిష్: ఫీల్ ది ఫైర్' చిత్రంతో ఆయన దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఎంతో మంది అగ్ర హీరోలతో పనిచేశారు.
సూపర్ హిట్ సినిమాలు
తన కెరీర్లో 'కాంటే', 'ముసాఫిర్', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా', 'జిందా', 'కాబిల్' లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను సంజయ్ గుప్తా ప్రేక్షకులకు అందించారు. హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా 'కాబిల్' కు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించగా.. రాకేష్ రోషన్ నిర్మించడం విశేషం.
చివరి మూవీ ఇదే
సంజయ్ గుప్తా కేవలం పాత తరానికే కాదు, కొత్త తరానికి కూడా దగ్గరగా ఉంటూ సినిమాలు తీశారు. ఆయన కెరీర్ లో డైరెక్ట్ చేసిన చివరి సినిమా 'ది మిరాండా బ్రదర్స్'. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ డ్రామాకు ఆయనే స్వయంగా కథ సమకూర్చి, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. హర్షవర్ధన్ రాణే, మీజాన్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి ఆదరణ పొందింది.
సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన సంజయ్ గుప్తా ప్రయాణం ఇలా ఊహించని రీతిలో ముగిసిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.