ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద జరిగే సందడి అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా 7 సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవడం విశేషం. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ నుంచి స్టార్ హీరోల మధ్య ఫైట్ ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్, అగ్ర తారల కలయికతో రాబోతున్న ఈ సినిమాలు ఇప్పటినుండే ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. 2026 జనవరి 9వ తేదీ శుక్రవారం కావడం, ఆ తర్వాత వీకెండ్, పండుగ సెలవులు కలిసి రావడంతో నిర్మాతలు ఈ తేదీలపై కన్నేశారు. మరి ఆ సినిమాలు ఏవో చూడండి.
ది రాజా సాబ్

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్ హారర్-కామెడీ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 9, 2026 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాదికి చిరుని రంగంలోకి దింపుతున్నాడు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
రవితేజ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ మధ్యే టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనగనగా ఒక రాజు
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' మూవీ కూడా సంక్రాంతి పండుగకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. అయితే భారీ సినిమాల మధ్య ఈ మూవీని రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.
నారి నారి నడుమ మురారి
{{/usCountry}}'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' మూవీ కూడా సంక్రాంతి పండుగకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. అయితే భారీ సినిమాల మధ్య ఈ మూవీని రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.
నారి నారి నడుమ మురారి
{{/usCountry}}శర్వానంద్ నటిస్తున్న మూవీ నారి నారి నడుమ మురారి. డిసెంబర్ లో బైకర్ మూవీతో వస్తున్న అతడు నెల రోజుల తర్వాత సంక్రాంతికి ఈ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు.
జన నాయగన్
దళపతి విజయ్ తన పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి మూవీ ఇది. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తెలుగులోనూ రానుంది.
పరాశక్తి
'సూరరై పోట్రు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పరాశక్తి'. 1965 నాటి యాంటీ-హిందీ ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.