...
...
Next Story

సంక్రాంతి 2026-బాక్సాఫీస్ ఫైట్‌-రాజాసాబ్ నుంచి షురూ-బరిలో చిరంజీవి, ర‌వితేజ సినిమాలు-ఏ తేదీకి ఏ మూవీ?

వచ్చే సంక్రాంతి సినీ లవర్స్ కు నిజమైన పండగ కానుంది. సీనియర్ హీరోల నుంచి జూనియర్ల వరకూ ఈ పండగ సీజన్ పై హీరోలు ఫోకస్ పెట్టారు. రాజా సాబ్ నుంచి షురూ కాబోతున్న ఈ పొంగల్ 2025 సినిమా సందడి మరో రేంజ్ కు వెళ్లబోతుంది. మరి ఏ సినిమా ఏ డేట్ నాడు రిలీజ్ అవుతుందో చూసేయండి.

Published on: Dec 28, 2025, 17:53:59 IST
Advertisement

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినీ ప్రేమికులకు నిజమైన పండగ వస్తుంది. ఏ ఏడాదైనా సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది. వచ్చే సంక్రాంతికి ఆ సందండి డబుల్ కానుంది. ఎప్పుడూ లేనట్లుగా 2026 సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో, అది కూడా భారీ స్థాయి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలున్నాయి.

రాజా సాబ్

సంక్రాంతి రేసులో సినిమాల రిలీజ్ డేట్లు
సంక్రాంతి రేసులో సినిమాల రిలీజ్ డేట్లు

2026 సంక్రాంతి పండగ రాజా సాబ్ సినిమాతో స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తదితరులు నటించారు. మారుతి డైరెక్టర్. ఈ సినిమాతో ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారని డైరెక్టర్ మారుతి బలంగా చెప్పాడు.

జన నాయకుడు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయకుడు. రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ ఇదే తన లాస్ట్ సినిమా అని ఇప్పటికే ప్రకటించేశాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. జన నాయకుడు కూడా జనవరి 9నే థియేటర్లలోకి రానుంది.

మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తున్నారు. ఆయన హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రెడీ అవుతున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపు దిద్దుకుంటోంది. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన కామెడీ మూవీ అనగనగా ఒక రాజు. ఈ సినిమా కూడా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 14న ఈ మూవీ థియేటర్లకు వస్తుంది. మరోవైపు శర్వానంద్, అదితి సాక్షి, సంయుక్త నటించిన నారీ నారీ నడుమ మురారీ కూడా జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks