టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 2) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారని అడిగితే తన తమ్ముడు బాగా సంపాదించడం వల్లే తనకు ఈ రెస్ట్ దొరికిందని అనడం విశేషం.
కపుల్ ఫ్రెండ్లీ మూవీపై..

సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మూవీపై సంతోష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పాడు. ఇక డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ గురించి మాట్లాడుతూ.. ఎన్నో మంచి సినిమాలు అతని నుంచి రానున్నాయని, అందులో ఇది మొదటిదని చెప్పాడు. హీరోయిన్ మానస వారణాసిపైనా సంతోష్ ప్రశంసలు కురిపించాడు.
రెండేళ్ల గ్యాప్ గురించి..
సంతోష్ శోభన్ సినిమాల్లో కనిపించక చాలా రోజులైంది. అతడు చివరిగా 2023లో వచ్చిన జోరుగా హుషారుగా షికారు పోదమా అనే మూవీలో నటించాడు. రెండేళ్లకుపైగా వచ్చిన గ్యాప్ గురించి ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రశ్నించగా.. అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తన తమ్ముడు సంగీత్ చాలా బాగా సంపాదిస్తున్నాడని, దీంతో కెరీర్లో తనకు ఎంతో విలువైన రెండేళ్ల గ్యాప్ దొరికిందని అన్నాడు. తాను, తన తమ్ముడు ఒక్కో సినిమాకు వచ్చే ఆదాయంపైనే జీవితాన్ని వెల్లదీస్తామనీ చెప్పాడు. అతడు కష్టపడటం వల్లే తనకు ఈ లగ్జరీ దొరికిందని, అందుకు అతనికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు.
ప్రభాస్‌కు వీరాభిమానిని..
ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కూడా సంతోష్ మాట్లాడాడు. అతనికి తాను వీరాభిమానినని అన్నాడు. ఈ మూవీ ట్రైలర్ చూశాడా అని అడిగినప్పుడు ఆ అవకాశం తనకు రాలేదని, వస్తే కచ్చితంగా ఎలా ఉందో అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. తన తండ్రి శోభన్ డైరెక్ట్ చేసిన వర్షం మూవీలోని వెంకట్ (ప్రభాస్ పాత్ర) తనకు ప్రేమలో స్ఫూర్తి అంటూ ఆ సినిమాలోని ఓ సీన్ గురించి ఓ కథలా చెప్పాడు.
కపుల్ ఫ్రెండ్లీ మూవీ విశేషాలు
{{/usCountry}}ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కూడా సంతోష్ మాట్లాడాడు. అతనికి తాను వీరాభిమానినని అన్నాడు. ఈ మూవీ ట్రైలర్ చూశాడా అని అడిగినప్పుడు ఆ అవకాశం తనకు రాలేదని, వస్తే కచ్చితంగా ఎలా ఉందో అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. తన తండ్రి శోభన్ డైరెక్ట్ చేసిన వర్షం మూవీలోని వెంకట్ (ప్రభాస్ పాత్ర) తనకు ప్రేమలో స్ఫూర్తి అంటూ ఆ సినిమాలోని ఓ సీన్ గురించి ఓ కథలా చెప్పాడు.
కపుల్ ఫ్రెండ్లీ మూవీ విశేషాలు
{{/usCountry}}తమిళ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించాడు. సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో నటించారు. ట్రైలర్ లో వీళ్ల లవ్ స్టోరీ, కొన్ని హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు, చెన్నైలాంటి ప్రదేశాల్లోనే ఈ మూవీని తీశారు. ఈ లవ్ స్టోరీపై అతడు చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.