బాలీవుడ్ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ముంబైలోని తన ఖరీదైన ఆస్తిని లీజుకు ఇచ్చి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంధేరీ వెస్ట్‌లోని తన బంగ్లాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు అద్దెకు సారా ఇచ్చినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.
స్కూల్ కోసం సారా బంగ్లా!

ప్రాపర్టీ డేటా సంస్థ 'సీఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన వివరాల ప్రకారం.. అంధేరీ వెస్ట్‌లోని ఓల్డ్ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న 'బెల్‌స్కాట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ'లో సారాకు ఒక బంగ్లా ఉంది. సుమారు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీని 'ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ లీజుకు తీసుకుంది. ఈ ప్రాంగణాన్ని వారు కేవలం పాఠశాల సంబంధిత కార్యకలాపాల కోసమే ఉపయోగించనున్నారు.
ఒప్పందంలోని కీలక అంశాలు:
అద్దె వివరాలు: నెలకు రూ. 6.5 లక్షల అద్దెతో ఈ లీజు ప్రారంభమవుతుంది. అంటే చదరపు అడుగుకు రూ. 144.44 చొప్పున రెంట్ ఖరారైంది.
మొత్తం విలువ: ఐదేళ్ల కాలానికి గాను ఈ లీజు విలువ సుమారు రూ. 4.14 కోట్లు.
డిపాజిట్: అద్దెదారు ఇప్పటికే రూ. 20 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు.
లాక్-ఇన్ పీరియడ్: ఐదేళ్ల లీజు కాలంలో మూడేళ్ల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ లోపు ఒప్పందాన్ని రద్దు చేయడానికి వీలుండదు.
అద్దె పెరుగుదల: మూడవ ఏడాది నుంచి ప్రతి ఏటా అద్దెను 5 శాతం మేర పెంచాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
అమలు: ఈ ఒప్పందం మే 1, 2026 నుంచి అమలులోకి రానుంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. రియల్ ఎస్టేట్ జోరు!
{{/usCountry}}అమలు: ఈ ఒప్పందం మే 1, 2026 నుంచి అమలులోకి రానుంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. రియల్ ఎస్టేట్ జోరు!
{{/usCountry}}అయితే, కేవలం సారా అలీ ఖాన్ మాత్రమే కాదు గత కొన్ని నెలలుగా ముంబైలో సెలబ్రిటీల ఆస్తి ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నుంచి టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీస్ వరకు ఉన్నారు.
మాధురి దీక్షిత్
మార్చి 24న లోయర్ పరేల్‌లోని 'వన్ లోధా ప్లేస్'లో 731 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్ల కాలానికి రూ. 2.81 కోట్లకు లీజుకు ఇచ్చారు మాధురి దీక్షిత్.
శ్రద్ధా కపూర్
జుహూలోని తన అపార్ట్‌మెంట్ లీజును ఏడాది కాలానికి శ్రద్ధా కపూర్ పొడిగించుకున్నారు. దీని కోసం ఆమె ఏకంగా రూ. 72 లక్షల వార్షిక అద్దెను ముందే చెల్లించడం విశేషం.
రాకేష్ రోషన్
గతేడాది డిసెంబర్‌లో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్, అంధేరీ వెస్ట్‌లోని వీరా దేశాయ్ రోడ్డులో ఉన్న 6,389 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌ను 'ఫ్యాబ్ ఇండియా' (Fabindia) సంస్థకు నెలకు రూ. 14.5 లక్షల అద్దెకు ఇచ్చారు.
రాని అధికారిక ప్రకటన
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెలబ్రిటీలు తమ పెట్టుబడులను ఇలా ఆదాయ వనరులుగా మార్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒప్పందంపై సారా అలీ ఖాన్ గానీ, సదరు విద్యా సంస్థ గానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.