...
...
Next Story

Rao Bahadur Trailer: తెలుగు సినిమా మునుపెన్నడూ చూడనిది.. రావు బహదూర్‌ను పరిచయం చేసిన మహేష్ బాబు.. ట్రైలర్ రిలీజ్

Rao Bahadur Trailer: సత్యదేవ్ నట విశ్వరూపం చూపిస్తూ రావు బహదూర్ ట్రైలర్ రిలీజైంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మిగిలిన సినిమాలకు భిన్నంగా ఈ ట్రైలర్ సాగింది. తెలుగు సినిమా మునుపెన్నడూ చూడనిది అంటూ సూపర్ స్టార్ ఈ మూవీపై ఆసక్తి పెంచేశాడు.

Published on: Jun 30, 2026, 20:49:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rao Bahadur Trailer: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' జులై 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Rao Bahadur Trailer: తెలుగు సినిమా మునుపెన్నడూ చూడనిది.. రావు బహదూర్‌ను పరిచయం చేసిన మహేష్ బాబు.. ట్రైలర్ రిలీజ్
Rao Bahadur Trailer: తెలుగు సినిమా మునుపెన్నడూ చూడనిది.. రావు బహదూర్‌ను పరిచయం చేసిన మహేష్ బాబు.. ట్రైలర్ రిలీజ్

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మంగళవారం (జూన్ 30) ట్రైలర్ రిలీజైంది. ఇది మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్

క్రేజీ మూవీ రావు బహదూర్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన బేస్ వాయిస్‌తో అందించిన వాయిస్ ఓవర్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా మెయిన్ థీమ్‌ను ఎలివేట్ చేస్తూ మహేష్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

"అనుమానం అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషయం. అది చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషిని కూడా మళ్లీ బతికేలా చేస్తుంది. అదే అనుమానం ఒక మనిషి మైండ్‌తో ఆడుకుంటూ అతన్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది" అంటూ మహేష్ బాబు సినిమా ఫిలాసఫీని అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారు.

సరికొత్త కాన్సెప్ట్‌తో మరింత సరికొత్తగా ట్రైలర్

రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ట్రైలర్లలా కాకుండా వెంకటేష్ మహా ఈ ట్రైలర్‌ను చాలా ఇంటెలిజెంట్‌గా కట్ చేశారు. ఇది కేవలం సినిమా కథను మాత్రమే కాకుండా, ఒక ఇంట్రెస్టింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌లా కూడా వర్కవుట్ అయ్యేలా డిజైన్ చేయడం విశేషం.

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు మాట్లాడుతూ.. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను 'రావు బహదూర్' అందించబోతుందని హింట్ ఇచ్చారు. సత్యదేవ్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌లోనూ జీవించేశాడని విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది.

వెంకటేష్ మహా మార్క్ మేకింగ్..

శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. మహేష్ బాబు తన జీఎంబీ బ్యానర్లో సినిమాను సమర్పిస్తుండటం సినిమా హైప్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. జులై 3న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్యదేవ్ కెరీర్‌కు ఒక గట్టి టర్నింగ్ పాయింట్ కానుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks