...
...
Next Story

Scene OTT: అఫీషియల్-నెట్‌ఫ్లిక్స్‌లోకి నెల రోజుల్లోనే వచ్చేస్తున్న సీన్- ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసేందుకు 5 కారణాలు!

Scene OTT: థియేటర్లలో అదరగొట్టిన సూర్య మూవీ ‘సీన్’ ఓటీటీ ఎంట్రీపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక సమాచారం పోస్టు చేసింది. మరి నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ను ఎందుకు చూడాలో చెప్పే 5 కారణాలు ఇక్కడున్నాయి.

Published on: Nov 29, 2026, 15:39:51 IST
Advertisement

Scene OTT: తమిళ స్టార్ హీరో సూర్య 2026లో అందుకున్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీ పేరు ‘సీన్’. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంంగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ మూవీ ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ చూద్దాం.

వింటేజ్ సూర్య స్వాగ్

అఫీషియల్-నెట్‌ఫ్లిక్స్‌లోకి నెల రోజుల్లోనే వచ్చేస్తున్న సీన్- ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసేందుకు 5 కారణాలు!
అఫీషియల్-నెట్‌ఫ్లిక్స్‌లోకి నెల రోజుల్లోనే వచ్చేస్తున్న సీన్- ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసేందుకు 5 కారణాలు!

సూర్యను ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లలో చూశాం. ముఖ్యంగా సింగం ఫ్రాంఛైజీ సినిమాల్లో పోలీస్ గా సూర్య ఎంత పవర్ ఫుల్ గా నటించాడో తెలిసిందే. కానీ సీన్ మూవీలో డీఎస్పీ ఇన్బరాజ్ గా సూర్య డిఫరెంట్ గా నటించాడు. కంటి చూపు లోపం ఉన్నప్పటికీ కేసు సాల్వ్ చేసే దిశగా సూర్య యాక్టింగ్ అదిరిపోయింది. ఇక కామెడీ టైమింగ్ తో వింటేజ్ సూర్యను గుర్తు చేశాడు.

డార్క్ కామెడీ థ్రిల్లర్

రోమాంచం, ఆవేశం లాంటి సినిమాలతో మలయాళంలో డైరెక్టర్ జీతు మాధవన్ అదరగొట్టాడు. ఇప్పుడు సీన్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీన్ మూవీలోనూ తనదైన డార్క్ కామెడీ థ్రిల్ ను డైరెక్టర్ కొనసాగించాడు. ఓ వైపు హత్యలు, ఇన్వెస్టిగేషన్ సాగుతుంటే మరోవైపు కడుపుబ్బా నవ్వించడం జీతు స్టైల్. అందుకే మిగతా క్రైమ్ థ్రిల్లర్ల కంటే కూడా సీన్ డిఫరెంట్ గా నిలిచింది.

విలన్ గా నస్లెన్

ప్రేమలు మూవీతో సౌత్ ఇండియా వైడ్ గా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో నస్లెన్. అలాంటి యంగ్ హీరో ఈ సీన్ మూవీలో విలన్ గా నటించి షాకిచ్చాడు. ఈశ్వరన్ అనే సైకో, సీరియల్ కిల్లర్ గా నస్లెన్ భయపెట్టాడు. చూడటానికి అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేస్తాడు. సూర్య, నస్లెన్ మధ్య నడిచే మైండ్ గేమ్ ప్రేక్షకులను సీడ్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది.

నజ్రియా రీ ఎంట్రీ

సీన్ మూవీని ముఖ్యంగా థ్రిల్ కోసం ఓటీటీలో కచ్చితంగా చూడొచ్చు. చూపు లేని పోలీస్ ఆఫీసర్ ఓ సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడన్న పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ క్రమంలో టెక్నాలజీని వాడిన తీరు, ఇన్వెస్టిగేషన్ సాగే విధానం చూసే ఆడియన్స్ కు నెట్‌ఫ్లిక్స్‌ లో ఉత్కంఠ కలిగిస్తాయి. అందుకే థియేటర్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks