Scene Review:

సినిమా : పేరు సీన్
నటీనటులు : సూర్య, నజ్రియా, నస్లెన్, టొవినో థామస్, ఆనందరాజ్ తదితరులు
డైరెక్టర్ : జీతూ మాధవన్
ప్రొడ్యూసర్ : సూర్య, జ్యోతిక, జయశ్రీ
రిలీజ్ డేట్ : నవంబర్ 6, 2026
2026లోనే కరప్పు (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో విజయాలు అందుకొని జోరుమీదున్నారు హీరో సూర్య. ఈ ఏడాది ఆయన నటించిన మూడో సినిమా ‘సీన్’ కూడా థియేటర్లలోకి వచ్చింది. నజ్రియా 12 ఏళ్ల తర్వాత తమిళంలో నటించిన మూవీ ఇది.
'రోమాంచం', 'ఆవేశం' లాంటి హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ జితు మాధవన్. యాక్షన్, రివేంజ్ డ్రామాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మెదడుకు పదును పెట్టే పాత్రలతో ఆయన తీసిన తాజా చిత్రం 'సీన్'. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత కండలు తిరిగిన యాక్షన్ హీరోగా కాకుండా, మైండ్ తో ఆడుకునే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే?
ఇన్బరాజ్ (సూర్య) క్రైమ్ బ్రాంచ్‌లో ఒక బ్రిలియంట్ డిటెక్టివ్. అయితే అనూహ్యంగా అతనికి కంటిచూపు పూర్తిగా పోతుంది. ఈ విషయాన్ని ప్రపంచానికి గోప్యంగా ఉంచి, ప్రశాంతంగా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు ఇన్బరాజ్ జైలుకు పంపిన 'పర్ఫ్యూమ్ సీరియల్ కిల్లర్' క్రైమ్ స్టైల్‌ను కాపీ కొడుతూ ఈశ్వరన్ (నస్లెన్) అనే సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు.
దీంతో కళ్లు లేని ఇన్బరాజ్ మళ్లీ బలవంతంగా ఫీల్డ్‌లోకి దిగాల్సి వస్తుంది. అంధుడైన ఇన్బరాజ్ అసలు ఈశ్వరన్‌ను ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది సీన్ మూవీ మిగతా కథ.
విశ్లేషణ
{{/usCountry}}దీంతో కళ్లు లేని ఇన్బరాజ్ మళ్లీ బలవంతంగా ఫీల్డ్‌లోకి దిగాల్సి వస్తుంది. అంధుడైన ఇన్బరాజ్ అసలు ఈశ్వరన్‌ను ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది సీన్ మూవీ మిగతా కథ.
విశ్లేషణ
{{/usCountry}}సీన్ సినిమా ఒక పర్ఫెక్ట్ చెస్ గేమ్ లా సాగుతుంది. డైరెక్టర్ జితు మాధవన్ ఇద్దరు జీనియస్‌ల మధ్య జరిగే పోరాటాన్ని అద్భుతంగా రాసుకున్నాడు. ముఖ్యంగా అంధుడైన హీరో కేసును సాల్వ్ చేయడం కోసం తన మతిమరుపు తండ్రి ఇరుదయరాజ్ (ఆనందరాజ్), తాగుబోతు తల్లి సెల్వి, అలాగే మూర్ఛ వ్యాధి ఉన్న యంగ్ జీనియస్ మాయ (నజ్రియా నజీమ్)ను తన టీమ్‌గా పెట్టుకోవడంతో కథలో అద్భుతమైన ఫన్ జనరేట్ అవుతుంది.
అంధత్వాన్ని కవర్ చేసుకోవడానికి ఇంట్లోని అలెక్సా, సిరి, గూగుల్ వంటి ఏఐ టూల్స్‌ను, యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను హీరో వాడుకునే విధానం చాలా కన్విన్సింగ్‌గా ఉంటుంది. సీరియస్ థ్రిల్లర్‌ను డార్క్ కామెడీతో బ్లెండ్ చేసిన విధానం సూపర్బ్.
అయితే స్క్రీన్ ప్లే టైట్ గా లేకపోవడం, ఓ దశలో లాజిక్స్ లేని స్టోరీ లైన్ తో మూవీ సాగడమే సీన్ మూవీకి మైనస్. సూర్య లాంటి స్టార్ హీరో డిఫరెంట్ గా ట్రై చేశారు. కానీ ఆయన రేంజ్ కు ఈ మూవీ చిన్నదిగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
సూర్య చాలా రోజుల తర్వాత ఎలాంటి అరుపులు, కండల ప్రదర్శన లేని సెటిల్డ్ పాత్రలో అదరగొట్టాడు. కళ్లు లేకపోయినా ఉన్నట్లు నటించడం, విలన్ కళ్లలోకి చూస్తూ మాట్లాడే సీన్స్ లో సూర్య పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. ఇక సైకో కిల్లర్ ఈశ్వరన్గా నస్లెన్ నటన సినిమాకు మరో హైలైట్. చాలా కూల్ గా ఉంటూనే క్రూరమైన హత్యలు చేసే విలన్ గా మెప్పించాడు. మాయ పాత్రలో నజ్రియా నజీమ్, తండ్రి పాత్రలో ఆనందరాజ్ తమ పరిమితుల మేరకు అద్భుతంగా నటించి అలరించారు.
టెక్నికల్ గా..
సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. అజ్మల్ సాబు ఎడిటింగ్ సినిమాకు ప్రాణం పోసింది. ఒకవైపు హీరో తన టీమ్‌ను సెట్ చేసుకుంటూ ఉంటే, ప్యారలల్‌గా విలన్ తన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసే మాంటేజ్ షాట్స్ కట్టిపడేస్తాయి. జితు మాధవన్ రైటింగ్, డైరెక్షన్ టాప్ నాచ్ అని చెప్పాలి. అత్యాధునిక టెక్నాలజీని కథలో ఆర్గ్యానిక్గా ఇమిడ్చిన తీరు అద్భుతం. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా..
ఇదొక ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఎలాంటి రొటీన్ యాక్షన్ లేకుండా.. మైండ్ గేమ్‌తో, విలక్షణమైన కామెడీతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. సూర్య వన్ మ్యాన్ షో, జితు మాధవన్ టేకింగ్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడొచ్చు.