OTT Thriller: అదిరే ట్విస్ట్ లు, ఉత్కంఠ కలిగించే స్టోరీ లైన్ తో తెరకెక్కిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు (ఏప్రిల్ 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాజిటివ్ టాక్ తో సాగిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం ఓటీటీ

కన్నడ సూపర్ హిట్ మూవీ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కన్నడ, తమిళ్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
సీక్వెల్
సీతారాం బెనోయ్ కేస్ నం.18 మూవీకి సీక్వెల్ గా కేస్ ఆఫ్ సీతారాం సినిమా వచ్చింది. ఇది ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో రిలీజైంది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ రాఘవేంద్ర, గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్ పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ నిర్మించారు.
8.6 రేటింగ్
సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం మూవీ థియేటర్లలో అదరగొట్టింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. నెమ్మదిగా స్టార్ట్ అయ్యి థ్రిల్ అందించే మూవీ ఇది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి విమర్శకులు ప్రశంసలు కూడా దక్కాయి. సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం మూవీకి 8.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం స్టోరీ
హత్యలు ఎవరు చేస్తున్నారు? దాని ఇన్విస్టిగేషన్, మధ్యలో వచ్చే మలుపులను ఉత్కంఠ కలిగించేలా తెరకెక్కిస్తేనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు జనాలను అలరిస్తాయి. అలాంటి జోనర్లోనే, ప్రేక్షకులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా వచ్చిన సినిమా సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం.
{{/usCountry}}హత్యలు ఎవరు చేస్తున్నారు? దాని ఇన్విస్టిగేషన్, మధ్యలో వచ్చే మలుపులను ఉత్కంఠ కలిగించేలా తెరకెక్కిస్తేనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు జనాలను అలరిస్తాయి. అలాంటి జోనర్లోనే, ప్రేక్షకులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా వచ్చిన సినిమా సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం.
{{/usCountry}}పాత కేసును సాల్వ్ చేసిన పోలీస్ ఆఫీసర్ సీతారాం (విజయ్ రాఘవేంద్ర) అనెగుడ్డ పోలీస్ స్టేషన్ లో తన డ్యూటీ కంటిన్యూ చేస్తాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలోనే వరుస హత్యలు చోటు చేసుకుంటాయి. సైకో కిల్లర్ ఈ హత్యలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ కిల్లర్ ను పట్టుకోవడానికి సీతారం రంగంలోకి దిగుతాడు.
మరి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతణ్ని సీతారాం ఎలా పట్టుకున్నాడు? అన్నదే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం మూవీ మిగతా స్టోరీ.