Spy Thriller OTT: దేశం కోసం సీక్రెట్ మిషన్.. ధురంధర్ రేంజ్.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న తెలుగు స్పై థ్రిల్లర్!

Spy Thriller OTT: ఓటీటీలోకి ఓ క్రేజీ తెలుగు స్పై థ్రిల్లర్ రాబోతుంది. ధురంధర్ రేంజ్ స్టోరీ, విజువల్స్ తో తెరకెక్కిన ఆ సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి. 

Published on: Nov 29, 2026, 21:46:06 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Spy Thriller OTT: స్నేహం, దేశభక్తి అనే రెండు స్ట్రాంగ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో అలరించిన ఈ తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.

దేశం కోసం సీక్రెట్ మిషన్.. ధురంధర్ రేంజ్.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న తెలుగు స్పై థ్రిల్లర్!
దేశం కోసం సీక్రెట్ మిషన్.. ధురంధర్ రేంజ్.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న తెలుగు స్పై థ్రిల్లర్!

సీక్రెట్ సోల్జర్ ఓటీటీ

సెప్టెంబర్ 18న థియేటర్లలో సీక్రెట్ సోల్జర్ మూవీ రిలీజైంది. అయితే ఈ మూవీకి రెస్పాన్స్ అంతంతమాత్రంగానే దక్కింది. ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 4 నుంచి సీక్రెట్ సోల్జర్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ పోస్టు పెట్టింది.

గంటా 48 నిమిషాలే

సీక్రెట్ సోల్జర్ మూవీ ఫస్ట్ ‘చైనా పీస్’ అనే టైటిల్ తో తెరకెక్కింది. కానీ సెన్సార్ బోర్డు ఆదేశాలతో మూవీ పేరును సీక్రెట్ సోల్జర్ గా మార్చారు. సెన్సారు బోర్డు దగ్గరే ఈ సినిమా దాదాసు 8 నెలలు పెండింగ్ లో ఉండిపోయింది. చివరకు ఒక గంటా 48 నిమిషాల రన్ టైమ్ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి అక్కి విశ్వనాథ రెడ్డి డైరెక్టర్.

సీక్రెట్ సోల్జర్ స్టోరీ ఇదే

సీక్రెట్ సోల్జర్ మూవీ అనేది ఇద్దరు ఫ్రెండ్స్, దేశభక్తి నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ కథ అని చెప్పొచ్చు. నెల్లూరుకు చెందిన మీరా వలి (నిహాల్ కోదాటి), పృథ్వీ (సూర్య శ్రీనివాస్) ప్రాణ మిత్రులు. వలికి చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలనే కల ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో అది నెరవేరదు.

అయితే వలి ఊహించిన విధంగా ఓ సీక్రెట్ ఇంటిలిజెన్స్ మిషన్ లో భాగమవుతాడు. కానీ అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ కావడంతో అందరూ వలిని దేశద్రోహిగా చూస్తారు. ఆ సమయంలోనే పృథ్వీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారు. అసలు వలి ఎవరు? ఆ సీక్రెట్ మిషన్ ఏంటీ? అనేది సీక్రెట్ సోల్జర్ సినిమాలో చూడాల్సిందే.

ధురంధర్ రేంజ్ లో

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ధురంధర్ సినిమాలు ఎంతటి సంచలనం క్రియేట్ చేశాయో తెలిసిందే. ఈ సీక్రెట్ సోల్జర్ మూవీ కూడా అలాంటి స్టోరీ లైన్ తోనే, అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కింది. దేశభక్తి సినిమాలు, ఉత్కంఠ రేపే సస్పెన్స్ చిత్రాలు, స్పై థ్రిల్లర్ మూవీస్ కావాలనుకునేవాళ్లకు ఓటీటీలో సీక్రెట్ సోల్జర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.