ఓటీటీలోకి ఇప్పుడు తెలుగు కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి జోనర్‌లో డిఫరెంట్ పాయింట్‌తో సరికొత్తగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో తెలుగు కంటెంట్‌వి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
హృద్యమైన సీన్లతో

ఇక ఈ వారం కూడా ఎన్నో తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. వాటిలో ఇవాళ తెలుగులో వచ్చిన మూవీ హృద్యమైన సీన్లతో, మనసును కదిలించే డైలాగ్స్‌తో తెరకెక్కింది. ఆ సినిమానే సీతా రాములు. తెలుగులో ఫ్యామిలీ డివోషనల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
ఎల్‌బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలో
సీతా రాములు సినిమాలో ప్రముఖ తెలుగు నటుడు ఎల్‌బీ శ్రీరామ్, నటి రాగ మాధురి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా వీరిద్దరి చుట్టూనే సాగుతుంది. ఈ ఇద్దరితోపాటు మహదేవ్, హేమంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
వర ముళ్లపూడి దర్శకత్వం
వర్మ డ్రీమ్ క్రియేషన్, సుచేత డ్రీమ్‌వర్క్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై సీతా రాములు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర వర్మ, రామ్ విశ్వాస్ హనుర్కర్ నిర్మాతలుగా ఉన్నారు. వర ముళ్లపూడి సీతా రాములు సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, సాయి మధుకర్ స్వరాలు సమకూర్చారు.
అచ్చ తెలుగు కంటెంట్‌తో
రవి బయ్యారపు రచించిన ఈ సినిమాకు రాఘవేంద్ర వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. అచ్చ తెలుగు కంటెంట్‌తో తెరకెక్కిన సీతా రాములు సినిమాలో బాగా వయసైన పంతులు సీతారామ శాస్త్రి (ఎల్‌బీ శ్రీరామ్) ఉంటాడు. ఊరిలోని సీతా రాముల గుడికి ఆయనే పూజలు చేస్తుంటారు. ఆయనకు ఒక కుమారుడు. సిటీలో ఉంటాడు.
తులం బంగారం 1300
అయితే, శ్రీరామనవమి పండుగ సమీపిస్తుండటంతో సీతమ్మవారికి బంగారు తాళి చేయించి సీతారాములకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటాడు పంతులు. కానీ, పేదవాడైన సీతరామ శాస్త్రి దగ్గర అంత డబ్బు ఉండదు. తాళికి తులంకిపైగా బంగారం కావాల్సి వస్తుంది. దానికి రూ. 1300 ఖర్చు అవుతుందని తాళి చేసే వ్యక్తి చెబుతాడు.
పట్టించుకోని కొడుకు
{{/usCountry}}అయితే, శ్రీరామనవమి పండుగ సమీపిస్తుండటంతో సీతమ్మవారికి బంగారు తాళి చేయించి సీతారాములకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటాడు పంతులు. కానీ, పేదవాడైన సీతరామ శాస్త్రి దగ్గర అంత డబ్బు ఉండదు. తాళికి తులంకిపైగా బంగారం కావాల్సి వస్తుంది. దానికి రూ. 1300 ఖర్చు అవుతుందని తాళి చేసే వ్యక్తి చెబుతాడు.
పట్టించుకోని కొడుకు
{{/usCountry}}సీతమ్మ తల్లికి బంగారు తాళి చేయించాలని ఊరిలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. కానీ, ఏ ఒక్కరు కూడా సహాయం చేయరు. ఆఖరికి కొడుకు కూడా పట్టించుకోడు. మరోవైపు పంతులు భార్య అనారోగ్యం పాలవుతుంది. ఓ వైపు భార్య, మరోవైపు సీతమ్మవారికి బంగారు తాళి రెండింటి మధ్య పంతులు ఏం చేశాడన్నదే సీతా రాములు కథ.
సీతా రాములు ఓటీటీ స్ట్రీమింగ్
మనసును మెలిపెట్టే డైలాగ్స్, కన్నీళ్లు తెప్పించే ఎల్‌బీ శ్రీరామ్ నటనతో ఈ సినిమా సాగినట్లు సీతా రాములు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చక్కటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన సీతా రాములు ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీలో
ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో మార్చి 22న సీతా రాములు ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతివారం ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా సీతా రాములు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అచ్చమైన తెలుగు కంటెంట్, డ్రామాలు ఇష్టపడేవారు ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం అవుతున్న సీతా రాములు సినిమాను ఎంచక్కా వీక్షించేయవచ్చు.