Jayaram Simran Marriage: తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?

Jayaram Simran Wedding Rumours: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, నటుడు జయరామ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌కు తెరపడింది. ఓ రొమాంటిక్ కామెడీ సినిమా కోసం జయరామ్, సిమ్రాన్ జోడీగా తొలిసారిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Aug 24, 2026, 16:57:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jayaram Simran Wedding Rumours: 90స్ కాలంలో తమ అద్భుతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు జయరామ్, హీరోయిన్ సిమ్రాన్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జతకడుతున్నారు. 2002లో కమల్ హాసన్ క్లాసిక్ కామెడీ చిత్రం 'పంచతంత్రం'లో కలిసి కనిపించిన ఈ ఇద్దరు దిగ్గజ నటులు, ఇప్పుడు తొలిసారిగా ప్రధాన జోడీగా (Lead Pair) నటించేందుకు సంతకం చేశారు.

తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?
తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?

ఎస్‌వై గౌతమ్ రాజ్ దర్శకత్వం

'రాట్చసి', 'కళువేత్తి మూరకన్' లాంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న దర్శకుడు ఎస్‌వై గౌతమ్‌ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వైభవంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రయాణం మొదలైంది.

90s జనరేషన్ vs Gen Z: వినోదాత్మక కథాంశం

ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుతున్నారు. 90ల నాటి తరం, ఇప్పటి జెన్ జీ (Gen Z) తరం మధ్య ఉన్న ఆలోచనా విధానాలు, వారి అనుబంధాలు, రెండు తరాల మధ్య వచ్చే వ్యత్యాసాలను నవ్వులు పూయించేలా ఆవిష్కరించబోతున్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్న ఈ రెండు తరాల వ్యక్తులు ఒకేచోట చేరినప్పుడు ఎదురయ్యే విచిత్రమైన, ఆసక్తికరమైన పరిస్థితులే కథకు ప్రధాన బలమని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

ఇతర కీలక పాత్రలు

సిమ్రాన్, జయరామ్‌లతో పాటు 'వాళై' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పొన్‌వెల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిక సతీష్, 'బక్స్'గా ప్రాచుర్యం పొందిన భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

హీరో ఆర్య సమర్పణలో భారీ తారాగణం

వైట్ కార్పెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కె. విజయ్ పాండి, రెడ్యాక్టెడ్ స్టూడియోస్ శంజన్ జి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్యకు చెందిన 'ది షో పీపుల్' బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దీపక్ ఛాయాగ్రహణం వహిస్తుండగా, అచు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

వరుస ప్రాజెక్టులతో జోరు మీద..

అరుల్ ఇ సిద్ధార్థ్ ఎడిటర్‌గా, మహేంద్రన్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు నటులు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. జయరామ్ ఇప్పటికే 'కర', 'పరిమళ అండ్ కో', 'జీడీఎన్' చిత్రాలతో అలరించారు.

త్వరలో టైటిల్, విడుదల తేది ప్రకటన

మరోవైపు సిమ్రాన్ కూడా శశికుమార్‌తో కలిసి చేసిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన 'ధర్మన్' చిత్రంలోనూ సిమ్రాన్ ఒక విలక్షణ పాత్రలో నటిస్తున్నారు. పేరు పెట్టని ఈ కొత్త సినిమా టైటిల్, విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

సిమ్రాన్ జయరామ్ పెళ్లి

ఇదిలా ఉంటే, జయరామ్, సిమ్రాన్ సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో వారిద్దరు దంపతుల్లా పూలదండలు వేసుకుని కనిపించారు. దాంతో జయరామ్, సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది.

యూట్యూబ్ థంబ్‌నెయిల్స్

లేటు వయసులో పెళ్లి అంటూ యూట్యూబ్‌లలో థంబ్‌నెయిల్స్ కూడా దర్శనం ఇచ్చాయి. ఇప్పుడు అసలు విషయం తెలిసి ముక్కున వేలెసుకుంటున్నారు నెటిజన్లు. సిమ్రాన్, జయరామ్ పెళ్లి చేసుకోలేదని, సినిమాలో జంటగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More