నన్ను దేశంలో అందరూ ద్రోహిలానే చూశారు, మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి

Rhea Chakraborty About Sushant Case In The Traitors 2: నన్ను దేశంలో అందరూ ద్రోహిలానే చూశారు, అత్యధికంగా ట్రోలింగ్ అయిన వ్యక్తిని నేనే, మళ్లీ అలాంటి పరిస్థితి నాకొద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది హీరోయిన్ రియా చక్రవర్తి. ది ట్రేటర్స్ 2 ఓటీటీ షోలో రియా చక్రవర్తి మాటలు అందరిని కలిచివేస్తున్నాయి.

Published on: Aug 20, 2026, 10:41:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rhea Chakraborty About Sushant Case In The Traitors 2: బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తీవ్ర వివాదాలు, మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న హీరోయిన్, అతని లవర్ రియా చక్రవర్తి ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'ది ట్రేటర్స్' సీజన్ 2 లో పాల్గొంటోంది.

నన్ను దేశంలో అందరూ ద్రోహిలానే చూశారు, మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి
నన్ను దేశంలో అందరూ ద్రోహిలానే చూశారు, మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ది ట్రేటర్స్ 2 షో ఐదో ఎపిసోడ్‌లో రియా చక్రవర్తి చేసిన కామెంట్స్ ప్రేక్షకులను, తోటి పోటీదారులను తీవ్రంగా కలచివేశాయి. ఈ ఓటీటీ షోలో భాగంగా నటి శ్వేతా తివారీ 'నువ్వు ఎందుకు ద్రోహివి కాదు (ట్రేటర్)?' అని ప్రశ్నించగా రియా అత్యంత భావోద్వేగంగా స్పందించింది.

"నేను ద్రోహిని కాదు.. నా వ్యక్తిగత జీవితమే ఒక పాఠం"

"నేను ఈ షోలో కావాలని ద్రోహిగా మారి ఎవరినీ మానసికంగా చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం నన్ను ఒక ద్రోహిగానే చూస్తోంది. నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల నుంచే నేను ఈ మాట చెప్తున్నా. మళ్లీ ఇక్కడికి వచ్చి అలాంటి ముద్ర వేయించుకుంటే నాపై మళ్లీ అసభ్యకరమైన మీమ్స్ తయారు చేస్తారు" అని రియా చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేసింది.

దేశంలోనే అత్యధికంగా ట్రోలింగ్‌కు గురైన వ్యక్తిని నేనేనని, తనపై వస్తున్న అనుమానాలు కేవలం ద్రోహిగా ఉన్న అసలు వ్యక్తి నుంచి దృష్టి మళ్లించడానికేనని స్పష్టం చేసింది. తాను గుడ్డిగా అందరినీ అనుకరించనని, నమ్మేలా మాట్లాడగల వ్యక్తిత్వం తనదని తెలిపింది రియా చక్రవర్తి.

సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా పోని సందేహాలు

2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కేసు నమోదు చేయడంతో ఆమెతో పాటు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.

కొన్ని నెలల క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) క్లోజర్ రిపోర్ట్ సమర్పించి, రియాపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. షో హోస్ట్ కరణ్ జోహార్ 'నువ్వు ఇన్నోసెంట్‌గా ఉండాలనుకుంటున్నావా లేక ద్రోహిగానా?' అని అడిగినప్పుడు..

చాలా ఏళ్లుగా అనుమానాల నీడలోనే బతికా

"నాకు ఈ ఏడాదే క్లీన్ చిట్ లభించింది. నేను నిరపరాధినని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. చాలా ఏళ్లుగా అనుమానాల నీడలోనే బతికాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు" అని కరణ్‌కు రియా చక్రవర్తి కన్నీళ్లతో వివరించింది.

సుశాంత్ మరణం తర్వాత జైలు జీవితం, నెటిజన్ల బహిష్కరణ, పీటీఎస్‌డీ (PTSD) వంటి తీవ్ర మానసిక సమస్యలతో పోరాడినట్లు రియా గతంలోనే వెల్లడించింది. ప్రస్తుతం ఆమె క్రమంగా కోలుకుంటూ మళ్లీ కెరీర్‌పై దృష్టి సారిస్తోంది.

ఓటీటీలో దూసుకుపోతున్న షో

మరోవైపు ది ట్రేటర్స్ సీజన్ 2 ఓటీటీలో దూసుకుపోతోంది. పోటీదారుల మధ్య అనుమానాలు, వ్యూహాలు పెరిగిపోతుండటంతో ఫ్రెండ్‌షిప్‌లు దెబ్బతింటున్నాయి. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పారుల్ గుప్తా ఎలిమినేట్ అవ్వగా.. కల్లు, క్రిస్టల్ డిసౌజా, షాహ్నీల్ గిల్ ట్రేటర్లుగా కొనసాగుతున్నారు.

ది ట్రేటర్స్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

మునావర్ ఫారూఖీ, మల్లికా షెరావత్, శ్వేతా తివారీ, అభిషేక్ మల్హన్ వంటి ప్రముఖులు కూడా పోటీ పడుతున్న ఈ రియాలిటీ షో ది ట్రేటర్స్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 13న ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More