...
...
Next Story

Indraja: జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ రెమ్యూనరేషన్ లీక్.. ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? సీనియర్ హీరోయిన్ క్రేజ్!

Indraja: ఈటీవీ పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ జడ్జ్, సీనియర్ నటి ఇంద్రజ పారితోషికానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న ఇంద్రజ బుల్లితెరపై వసూలు చేస్తున్న రెమ్యునరేషన్ పై ఓ లుక్కేయండి.

Published on: Jul 15, 2026, 10:28:44 IST
Advertisement

Indraja: తెలుగు బుల్లితెరపై దాదాపు దశాబ్ద కాలంగా తిరుగులేని రేటింగ్‌లతో దూసుకుపోతున్న షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు స్టార్స్ అవ్వడమే కాదు, ఇక్కడ జడ్జీలుగా వ్యవహరించిన సెలబ్రిటీల క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. ప్రస్తుతం జడ్జ్ గా చేస్తున్న ఇంద్రజ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

జబర్దస్త్ క్వీన్ ఇంద్రజ

జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ రెమ్యూనరేషన్ లీక్.. ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? (youtube/etv jabardasth)
జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ రెమ్యూనరేషన్ లీక్.. ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? (youtube/etv jabardasth)

ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్ ఇంద్రజ. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ప్లాన్డ్‌గా అడుగులు వేసింది. వెండితెరపై తల్లి, అత్త వంటి కీలకమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే బుల్లితెరపై జడ్జ్‌గా స్థిరపడిపోయింది. పాపులర్ కామెడీ స్కిట్ షో జబర్దస్త్ లో జడ్జ్ గా చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.

షాకింగ్ రెమ్యునరేషన్

బుల్లితెర ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంద్రజ జబర్దస్త్‌ రెమ్యునరేషన్ షాక్ కలిగిస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకి నాలుగు లేదా ఐదు ఎపిసోడ్‌ల షూటింగ్స్ లెక్కన చూసుకుంటే కేవలం ఈ ఒక్క కామెడీ షో ద్వారానే ఆమెకు భారీ ఆదాయం సమకూరుతోంది.

ఇంద్రజ తన కరిష్మా, టైమింగ్‌తో షోను నడిపిస్తున్న విధానానికి ఈ రెమ్యూనరేషన్ పక్కా జస్టిఫికేషన్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. షోలో ఆమె ప్రజెంటేషన్ కూడా టీవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందని అంటున్నారు.

నాగబాబుకు ఇలా

పాత జడ్జీలు, ఇతరులతో పోలిస్తే ప్రస్తుతం ఇంద్రజ తీసుకుంటున్న పారితోషికం తక్కువగా అనిపించవచ్చు. అయితే, ప్రస్తుతం బుల్లితెరపై కాంపిటీషన్ పెరగడం, కమెడియన్ల బడ్జెట్ ఈక్వేషన్స్ మారడంతో మేనేజ్‌మెంట్ జడ్జీల పారితోషికాలను రీ-స్ట్రక్చర్ చేసింది.

రూ.2.5 లక్షల మార్కెట్ ప్రైస్ అనేది ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోయిన్‌కు ఇచ్చే అత్యుత్తమ పారితోషికాలలో ఒకటి. ఇంద్రజకున్న రిచ్ మూవీ హిస్టరీ, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్లీన్ ఇమేజ్ వల్లే ఈ డీల్ సాధ్యమైందని అంటున్నారు. మరోవైపు సినిమాలు, ఓటీటీ సిరీస్ లతోనూ ఇంద్రజ బిజీబిజీగా గడిపేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks