ఒకప్పుడు వరుసగా సక్సెస్ లు అందుకున్న హీరో రాజశేఖర్. ఈ సీనియర్ హీరో ఇప్పటికీ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ అప్పుడప్పుడూ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు బైకర్ మూవీలో హీరో తండ్రిగా క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు. ఇలా క్యారెక్టర్ రోల్స్ చేయడంపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. బైకర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అతని స్పీచ్ వైరల్ గా మారింది.
రాజశేఖర్ కామెంట్లు

శర్వానంద్ హీరోగా వస్తున్న ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ ‘బైకర్’. ఇందులో హీరో తండ్రి, మెంటార్ గా రాజశేఖర్ నటించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడు తనకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా శర్వానంద్ వంటి యంగ్ హీరోతో కలిసి నటించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా
తాను హీరోగా మాత్రమే కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ వెల్లడించాడు. "గత రెండు మూడేళ్లుగా నేను క్యారెక్టర్ రోల్స్ చేయాలని అనుకుంటున్నా, కానీ సరైన సబ్జెక్ట్ దొరకలేదు. ఇప్పుడు బైకర్ మూవీ చేశాను" అని రాజశేఖర్ అన్నాడు.
సెకండ్ లెవల్
‘‘నా సినిమా ఎప్పుడు వస్తుందని రీసెంట్ అడిగారు. బైకర్ వస్తుంది కదా చెప్పా. అది శర్వానంద్ సినిమా కదా అన్నారు. అప్పుడే అర్థమైంది. సెకండ్ లెవల్ కు వెళ్లిపోయానేంట్రా అనుకున్నా. కానీ ఈ విషయంలో తన పిల్లలు, జీవిత మద్దతు ఇచ్చారు. ‘డాడీ ఇప్పుడు సెకండ్ లెవల్ అంటూ ఏం లేదు. మంచి పాత్రలు వస్తే వదులుకోవద్దు’ అని చెప్పారు’’ అని రాజశేఖర్ వెల్లడించాడు.
రాజశేఖర్ రిక్వెస్ట్
"నేను ఇప్పుడు అన్ని రకాల పాత్రలకు అడ్జస్ట్ అయిపోయా. నాకు క్యారెక్టర్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను అన్ని సినిమాల్లో పెట్టుకోండి" అని రాజశేఖర్ తెలిపాడు. దీంతో ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేసేందుకు రెడీగా ఉన్నానని, సినిమాలు చేయాలని ఉందని రాజశేఖర్ క్లియర్ గా చెప్పేశాడు.
హీరోలాగే
{{/usCountry}}"నేను ఇప్పుడు అన్ని రకాల పాత్రలకు అడ్జస్ట్ అయిపోయా. నాకు క్యారెక్టర్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను అన్ని సినిమాల్లో పెట్టుకోండి" అని రాజశేఖర్ తెలిపాడు. దీంతో ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేసేందుకు రెడీగా ఉన్నానని, సినిమాలు చేయాలని ఉందని రాజశేఖర్ క్లియర్ గా చెప్పేశాడు.
హీరోలాగే
{{/usCountry}}శర్వానంద్ చాలా స్వీట్ పర్సన్ అని, తన పట్ల ఎంతో మర్యాదగా ఉంటాడని రాజశేఖర్ ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో యూవీ క్రియేషన్స్ వాళ్లు తనను ఒక హీరోలాగే చూసుకున్నారని, ఆ ట్రీట్మెంట్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపాడు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న ఈ 'బైకర్' సినిమా ఒక కొత్త రకమైన అనుభూతిని ఇస్తుందని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశాడు.