...
...
Next Story

షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్‌.. 3 గంట‌ల పాటు స‌ర్జ‌రీ.. అస‌లేమైందంటే?

కొంత విరామం తర్వాత తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సీనియర్ హీరో రాజశేఖర్ కు తీవ్ర గాయమైంది. షూటింగ్ లో గాయపడ్డ ఈ యాంగ్రీ స్టార్ కు 3 గంటల పాటు సర్జరీ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

Published on: Dec 9, 2025, 11:58:19 IST
Advertisement

'సీనియర్ హీరో రాజశేఖర్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఇది. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వచ్చిన రాజశేఖర్ కు మూవీ షూటింగ్ లో తీవ్రమైన గాయమైంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామ తర్వాత వరుస సినిమాలకు సంతకాలు చేశారు. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కాలికి గాయాలు అయ్యాయి.

షూటింగ్ లో రాజశేఖర్ కు గాయం

రాజశేఖర్
రాజశేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది.

3 గంటల సర్జరీ

రాజశేఖర్ గాయానికి మూడు గంటల పాటు కష్టపడి డాక్టర్లు సర్జరీ చేశారు. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.

ఇప్పుడు రెస్ట్

సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టిపరిస్థితుల్లోనూ కడపకూడదని చెప్పారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.

గతంలోనూ

రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'బైకర్'. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల చిత్రీకరణలు మొదలు అవుతాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe