Friday Top Ott Releases: ఇవాళ ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 7 సినిమాలు..హారర్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ డ్రామా వరకూ!

Friday Top Ott Releases: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో ఎంటర్ టైన్మెంట్ మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సరికొత్త సిరీస్ లు డిజిటల్ డెబ్యూ చేసేస్తాయి. ఇవాళ కూడా అదిరిపోయే రిలీజ్ లు మీ కోసం రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ఇవాళ ఓటీటీలో చూడాల్సిన టాప్ 7 రిలీజ్ లపై ఓ లుక్కేయండి. 

Published on: Sep 4, 2026, 11:32:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Friday Top Ott Releases: ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందా? అని వెయిట్ చేస్తుంటారు. శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి ఉంటే.. ఇక్కడ ఓటీటీలోనూ కొత్త రిలీజ్ ల జోరు ఉంటుంది. ఈ రోజు (సెప్టెంబర్ 4) ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ వరకూ డిఫరెంట్ జోనర్ల సినిమాలు, సిరీస్ లు వచ్చాయి.

ఇవాళ ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 7 సినిమాలు..హారర్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ డ్రామా వరకూ!
ఇవాళ ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 7 సినిమాలు..హారర్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ డ్రామా వరకూ!

జగమే సంగీతం - ప్రైమ్ వీడియో

శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. కర్నాటిక్ సంగీత దిగ్గజం శాస్త్రి (ప్రకాష్ రాజ్) కుటుంబ వారసత్వాన్ని కాపాడుతూ, తన సొంత సంగీత శైలిని ఆవిష్కరించుకోవాలని తపించే ఒక యువకుడి (అక్షయ్) కథ ఇది.

శాస్త్రీయ సంగీతం, ఆధునిక శబ్దాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ను సుస్మిత కొణిదెల ఎమోషనల్‌గా నిర్మించారు. సంగీతాభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది పర్ఫెక్ట్ వాచ్.

డీసీ - సన్ నెక్స్ట్

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ డీసీ. తప్పు చేసే పోలీసులను ఎవరు శిక్షిస్తారనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన మూవీ ఇది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నేటి నుంచి సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. మాస్ యాక్షన్ డ్రామాలను ఆస్వాదించేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

​ది కోర్ట్ - జియోహాట్‌స్టార్

నత్తి సమస్యతో బాధపడుతూ సమాజం నుంచి ఎదురైన అవమానాలను జయించే ఓ అమ్మాయి కథ ఇది. ఓ లాయర్ గా ఆ అమ్మాయి తన ఉనికిని చాటుకుంటుంది. ఒక ధైర్యవంతమైన మహిళా లీగల్ అసిస్టెంట్ యాజిని ప్రయాణమే ఈ సిరీస్. ఇది వీక్లీ ఎపిసోడ్ల రూపంలో ప్రసారం కానుంది.

​వీరభద్రుని రహస్యం - జీ5

సీజన్ 1 పార్ట్ 1 సాధించిన విజయం తర్వాత.. పార్ట్ 2 నేటి నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, దైవిక శక్తులు, పురాతన రహస్యాల ఆధారంగా ఈ సిరీస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది.

ధమాల్ 4 - నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ ‘ధమాల్’ నుంచి వచ్చిన నాలుగో మూవీ ఇది. నిధి వేట, గందరగోళం, నాన్-స్టాప్ హ్యూమర్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వీకెండ్‌లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరైన నవ్వుల విందును ఇస్తుంది.

​జీడీఎన్ - నెట్‌ఫ్లిక్స్

కోలీవుడ్ నుండి వచ్చిన మరో డిఫరెంట్ అటెంప్ట్ 'జీడీఎన్'. భావోద్వేగాలు, సామాజిక అంశాల ఆధారంగా సాగే ఈ తమిళ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా గ్లోబల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

కొరియన్ కనకరాజు - నెట్‌ఫ్లిక్స్

తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ ఇది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కామెడీ, మిస్టరీ అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More