Mouni Roy: ముగిసిన వైవాహిక జీవితం- 15 ఏళ్ల స్నేహం, రాత్రికి రాత్రే రొమాంటిక్ జంట? మౌనీ రాయ్‌తో డేటింగ్‌పై హీరో అర్జున్
Arjun Bijlani On Mouni Roy Dating Rumours: భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోయిన తర్వాత నటి మౌనీ రాయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు సీరియల్ హీరో అర్జున్ బిజ్లానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ 15 ఏళ్ల పవిత్రమైన స్నేహాన్ని వ్యూస్ కోసం వాడుకోవద్దంటూ క్లిక్ బైట్ పేజీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Arjun Bijlani On Mouni Roy Dating Rumours: ప్రముఖ హిందీ టెలివిజన్ రంగంలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్, సీరియల్ హీరో అర్జున్ బిజ్లానీల చుట్టూ తిరుగుతున్న డేటింగ్ పుకార్లకు ఒక్కసారిగా తెరపడింది. ఇటీవల వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసి వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్, క్యాప్షన్లతో
ఈ వీడియో ఆధారంగా కొన్ని గాసిప్ పేజీలు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్, క్యాప్షన్లతో ప్రచారం మొదలుపెట్టాయి. ఈ వ్యవహారంపై అర్జున్ బిజ్లానీ తీవ్రంగా స్పందిస్తూ పుకార్ల రాయుళ్లకు గట్టి బుద్ధి చెప్పారు.
కేవలం వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం కొందరు చేస్తున్న ఇటువంటి చౌకబారు ప్రచారాలను అర్జున్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడటాన్ని కూడా ఇలా వక్రీకరించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ తప్పుడు ప్రచారాలపై అర్జున్ బిజ్లానీ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా?
"15 ఏళ్లకు పైగా స్నేహాన్ని పంచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.. కేవలం ఒక గాసిప్ పేజీ హెడ్‌లైన్ కోసం రాత్రికి రాత్రే జంటగా మారిపోరు. ఒక స్నేహితురాలు కష్ట కాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం స్నేహ ధర్మం. ప్రతి బంధానికి రొమాంటిక్ యాంగిల్ జోడించి వ్యూస్ సంపాదించాలనుకోవడం సరికాదు. వార్తలు రాసే ముందు కనీస నిజనిజాలు తెలుసుకుంటే బాగుంటుంది. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుంది, ఇలాంటి క్లిక్ బైట్లు కాదు" అని అర్జున్ బిజ్లానీ మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై వీరి సహ నటి క్రిస్టల్ డిసౌజా కూడా స్పందించారు. "ఏం పిచ్చి ఇది.. కేవలం వ్యూస్ కోసం మీరు ఏదైనా పోస్ట్ చేస్తారా?" అని క్రిస్టల్ డిసౌజా సదరు గాసిప్ పేజీ కామెంట్ సెక్షన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముగిసిన మౌనీ రాయ్ వైవాహిక బంధం
మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ నుంచి విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పుకార్లు రావడం గమనార్హం. గత జనవరి 27, 2022న వీరిద్దరూ గోవా వేదికగా మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని నెలలుగా వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, తాము విడిపోతున్నట్లు మే 14న సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
తమ ప్రాధాన్యతలు మారడం వల్లే పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, వ్యక్తిగత విషయాలను గౌరవించి తమకు ప్రైవసీ ఇవ్వాలని వారు కోరారు. మానసికంగా ఎంతో ఇబ్బందికరంగా ఉండే ఇలాంటి విడాకుల సమయంలో మౌనీకి అండగా ఉండేందుకే స్నేహితుడిగా అర్జున్ బిజ్లానీ ఆమెను కలిశారు.
'నాగిని' జోడీగా ఫుల్ క్రేజ్
అర్జున్ బిజ్లానీ, మౌనీ రాయ్ కేవలం హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఏక్తా కపూర్ నిర్మించిన సంచలన సీరియల్ 'నాగిని' (Naagin) తెలుగు బుల్లితెరపై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
హీరోగా అర్జున్
ఇందులో 'శివన్య' పాత్రలో మౌనీ రాయ్, 'రితిక్' అనే హీరో పాత్రలో అర్జున్ బిజ్లానీ అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వీరి ఆన్-స్క్రీన్ జోడీకి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. దాదాపు 15 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న వీరి స్నేహం ఎంతో పటిష్టమైనదని, ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల తమ బంధం చెడిపోదని వారి సన్నిహితులు సైతం స్పష్టం చేస్తున్నారు.


మౌనీ రాయ్ సినిమాలు
ప్రస్తుతం మౌనీ రాయ్ తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. ఇటీవల 'ది భూత్ని', 'సలాకర్' వంటి ప్రాజెక్టులతో అలరించిన ఆమె, త్వరలో 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే చిత్రంలో అలరించారు. అయితే, చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా మౌనీ రాయ్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


